Slider హైదరాబాద్

అమీర్ పేట ప్రభుత్వ ఆసుపత్రి అలంకార ప్రయనికేనా?

#katragaddaprasuna

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేట లోని ప్రభుత్వ బస్తీ దవాఖాన లో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం, సరైన మౌలికమైన వసతులు లేకపోవడం నిజంగా శోచనీయమని మాజీ శాసనసభ్యురాలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

వందల కోట్ల రూపాయల తో స్థాపించిన ఈ ఆసుపత్రి కి బయట ఆర్భాటం తప్ప ఆసుపత్రి లోపల సౌకర్యాలు లేవని ఆమె తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి  కేసీఆర్ చాలా సార్లు  స్పష్టం చేశారు. కానీ ఆ మాటలు ఆచరణలో లేకపోవడం వైద్య శాఖ  వైఫల్యం గా కనిపిస్తుంది అని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.

వైద్యరంగంలో తెలంగాణ ఆదర్శంగా నిలబడాలి అంటే ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించి, అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో తెస్తే తప్ప పేద ప్రజల కి అందుబాటులో నాణ్యమైన వైద్యం రాదని ఆమె అన్నారు.

అమీర్ పేట లో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం కేవలం ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకే కాదు చుట్టూ పక్కల ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ మూడు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మంచి వైద్యం అందిచే అవకాశం ఉందని ఆమె అన్నారు.

ముఖ్యంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగతిన ఏర్పాటు చేసి తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, వాహీద్, శ్రీనివాస్ యాదవ్, స్థానిక ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్ టాపర్ ను అభినందించిన డాక్టర్ కొత్తపల్లి

Satyam NEWS

నో సొల్యూషన్: కిరోసిన్ డబ్బాలతో కలెక్టరేట్ ఎక్కిన రైతులు

Satyam NEWS

ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment