41.2 C
Hyderabad
May 4, 2024 18: 09 PM
Slider ప్రత్యేకం

ఉత్తరాది అధికారులకే హైదరాబాద్ సీపీ ఛాన్స్

#Police Officers

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఖాళీ అయిన పోలీస్‌ పోస్టుల్లో ఎవర్ని నియమిస్తారనే ఉత్కంఠ ప్రస్తుతం ఆ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఎవర్ని నియమిస్తారనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన స్థానాల్లో నియమించేందుకు అర్హులైన ముగ్గురి పేర్లు సూచించాలని ఈసీ కోరింది. హైరాబాద్‌ సీపీ సహా కమిషనర్ల పోస్టుకు సంబంధించి మాత్రం రాష్ట్రంలో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారుల పేర్లన్నీ పంపాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి మొత్తం 17 మందితో కూడిన అదనపు డీజీ స్థాయి అధికారుల జాబితాను పంపడంతోపాటు..వారిలో ముగ్గురి జాబితాను వేరుగా పంపినట్లు సమాచారం. మిగిలిన కమిషనర్ల పోస్టులకు సీనియర్‌ ఐపీఎస్‌లు, ఎస్పీల పోస్టులకు 2014, 2015, 2016, 2017 బ్యాచ్‌ల ఐపీఎస్‌ల పేర్లను ప్యానల్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.

సందీప్‌శాండిల్య, సంజయ్‌కుమార్‌ జైన్‌, శ్రీనివాసరెడ్డి?

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారినే హైదరాబాద్‌ సీపీగా నియమించేందుకు ఎన్నికల కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్‌శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌లకు అవకాశాలు ఎక్కువగా ఉండే వీలుంది. లేనిపక్షంలో చాలాకాలంగా అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు సైతం తెరపైకి రానుంది. ముక్కుసూటి అధికారిగా పేరున్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అదనపు డీజీ (ఆర్గనైజేషన్స్‌)గా పనిచేస్తున్నారు. మహేష్‌భగవత్‌కు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరిగినప్పుటికీ మునుగోడు ఎన్నికలప్పుడు ఆయన రాచకొండ కమిషనర్‌గా ఉండటం, చౌటుప్పల్‌ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి రావడం ఆటంకంగా మారింది. ఇక వేటుకు గురైన పది మందిఎస్పీలలో సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు మాత్రమే ఐపీఎస్‌ హోదా ఉంది. మిగతా వారంతా నాన్‌క్యాడర్‌ ఎస్పీలే. వీరందరి స్థానంలో ఐపీఎస్‌లనే నియమించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Related posts

తరచూ వివాదాల్లో ఆడపూరు ఇసుక క్వారీ….

Satyam NEWS

గ్యాంగ్ రేప్:మైనర్ బాలిక ను నిర్బంధించి అత్యాచారం

Satyam NEWS

పతనంలో పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ!

Bhavani

Leave a Comment