29.7 C
Hyderabad
May 6, 2024 06: 57 AM
Slider కడప

తరచూ వివాదాల్లో ఆడపూరు ఇసుక క్వారీ….

#sand policy 1

కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరు క్వారీ లో గురువారం నిర్వాహకులకు, ఇసుక తరలింపు దారులకు తీవ్ర వివాదం నెలకొంది.

వివిధ సుదూర ప్రాంతాల నుండి వచ్చే ట్రీప్పర్ లు, ట్రాక్టర్ లతో క్వారీ నిండి పోయింది. గత మూడు రోజుల నుంచి పడి గాపులు గాస్తూన్నా, ఇసుక లోడ్ చేయడం లేదని, స్థానికంగా ఉన్న పలుబడి వున్న వారికి మాత్రమే ఇసుకను ఇసున్నారని ఇసుక తరలింపు వాహన దారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

పలుకుబడి ఉన్న వారు నేరుగా క్వారీ వద్ద రోజుకు దాదాపు 5 సార్లు ఇసుకను లోడ్ చేసి తరలించడం జరుగుతోందని ట్రీప్పర్ ట్రాక్టర్ డ్రైవర్ లు వాహనాలను నిలిపి వేసి నిరసన తెలియ జేశారు.

కాగా క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం,అక్కడే ఉన్న ఎస్.యి.బి అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం వారు వాగ్వాదంకు దిగారు.

ఆడపూరు క్వారీ నిత్యం వివాదాస్పదం కావడం ఉన్నత స్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. ఇసుక తరలింపులో నిబంధనలు పాటిస్తే వివాదాలు సర్దుమనుగుతాయి.

Related posts

రాష్ట్ర మంతటా వేదవ్యాసుని జయంతి వేడుకలు..!

Satyam NEWS

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

Satyam NEWS

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment