ఒడిశాలో ప్రయాణిస్తున్నబస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రము లో ని గంజాం జిల్లాలోని బొలంత్ర లిమిట్స్ లో మంద్ రాజ్ పూర్ మార్గంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ముప్పై మందికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో గాయపడ్డవారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.