39.2 C
Hyderabad
May 3, 2024 12: 54 PM
Slider క్రీడలు

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

#ministerktr

అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఐదు సెట్ల విజయం సాధించిన తరువాత  హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ శిబిరం మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నది. ఈ టీమ్‌ 2023 సీజన్‌  రూపే వాలీబాల్‌ లీగ్‌ కోసం నూతన జెర్సీని నేడు విడుదల చేశారు. ఈ జెర్సీ చూడగానే ఆకట్టుకునే రీతిలో బ్లాక్‌ మరియు ఆరెంజ్‌ డిజైన్‌ కలిగి ఉంది. ఈ జెర్సీని  తెలంగాణా రాష్ట్ర ఐటీ, పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి , వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి కె టి రామారావు ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా తెలంగాణా రాష్ట్ర  పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలంగాణా ఒలింపిక్‌ బాడీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.

‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో  క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా వ్యాపార సమాజపు మద్దతు నిలుస్తుంది’’ అని మంత్రి  కె  టి రామారావు అన్నారు. ‘‘ఈ సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ మెరుగైన ప్రదర్శన కనబరచాలని  ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు

తెలంగాణా ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ ఆవిష్కరణ  కార్యక్రమానికి హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్‌ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్‌ ఓనర్‌), శ్యామ్‌ గోపు (సహ యజమాని) సమన్వయం చేశారు. హైదరాబాద్‌ టీమ్‌లో అంతగా అనుభవజ్ఞులు లేకపోయినప్పటికీ వారాంతంలో  అహ్మదాబాద్‌పై అత్యుత్తమ ప్రదర్శనను ఈ టీమ్‌ కనబరిచింది.

‘‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్‌  అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.  హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని  ప్రిన్సిపల్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి అన్నారు. ‘‘ తెలంగాణా ప్రభుత్వం టీమ్‌కు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. వారి మద్దతు టీమ్‌కు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చక్కటి ఆరంభానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

హైదరాబాద్‌లో క్రీడాకారులకు పూర్తి మద్దతును తెలంగాణా ప్రభుత్వం అందిస్తుంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న మహానగరంలో  క్రీడ మరియు వినోదాన్ని మెరుగుపరచడంలో వీరి నిబద్ధతకు మరో నిదర్శనంగా ఇది నిలువనుంది.

బ్రెజిల్‌, ఇటలీ, జపాన్‌ లాంటి దేశాలలో  అభివృద్ధి చెందుతున్న వాలీబాల్‌ సంస్కృతిని అనుకరించే మార్గంలో భారతదేశం ఉందని అభిషేక్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మనకు కావాల్సింది లోతుగా సమాజంతో మమేకమవడం’’ అని ఆయన అన్నారు. ‘‘బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి  ఉంది. ‘చోటు లీగ్స్‌’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్‌’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము.  తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని అన్నారు.

ఈ నగరానికి మహోన్నత వాలీబాల్‌ సంస్కృతి ఉంది. దేశపు ప్రీమియర్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ రెండవ ఎడిషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడానికి హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ పూర్తిగా సన్నద్ధమైంది.

For more details, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన

Satyam NEWS

రామతీర్ధం ఘటనకు విశ్వహిందూపరిషత్ నిరసన యాత్ర

Satyam NEWS

పరువు నష్టం దావాపై రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట

Satyam NEWS

Leave a Comment