28.7 C
Hyderabad
May 5, 2024 23: 20 PM
Slider విజయనగరం

తాగి డ్రైవ్ చేసిన 10 మందిని అదుపులోకి..!

కొత్త ఏడాది సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే క్రమంలో ఇయర్ ఎండ్ రోజు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరపాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం…మరోవైపు కొత్త ఏడాది కి ఆహ్వానం పలుకుతూ ఆనందం తో మద్యం సేవించి రోడ్ల పై బైక్ ల పై తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడమే కాక లోపల తోస్తుంది. ఇందులో భాగంగా విజయనగరంలో ఒ వైపు జిల్లా పోలీస్ బాస్… ఇయర్ ఎండింగ్ లో బందోబస్తు కై నగరంలో ని గంటస్థంభం వద్ద పరిస్థితి చూసి డీఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించిన బాధ్యతలను పరిశీలిస్తున్న క్రమంలో నే ట్రాఫిక్ పోలీసులు… మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని…డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసి మరీ కేసులు నమోదు చేసి స్టేషన్ కు పంపించారు. ఇలాగే నగరంలో ని బాలాజీ జంక్షన్ వద్ద మద్యం సేవించి వాహనం నడుపుతున్న పదిమంది అడ్డంగా ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయారు. వారిపై కేసులు నమోదు చేయడం తో పాటు వారి బైక్స్ తో అందరికీ స్టేషన్ కు తరలించారు.

Related posts

వి ఎస్ యూ పి జి సెంటర్ కావలి లో ఘనంగా సైన్స్ డే వేడుకలు

Satyam NEWS

మదర్ టంగ్: మాతృభాషతో సంపూర్ణ మానసిక వికాసం

Satyam NEWS

పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment