29.7 C
Hyderabad
May 4, 2024 05: 31 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఆ ఎన్నికలకు సర్వంసిద్ధం..నోటిఫికేషన్ ఆలస్యం

#kollapurmpdo

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో త్వరలో జరగబోయే  స్థానిక ఉప ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు అధికారుల నుండి తెలుస్తోంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో కొల్లాపూర్ ఎంపీపీ పదవికి, ఎంపిటిసి పదవికి గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ముందుగా ఆమె మాచినేని  పల్లి  గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె సర్పంచ్ పదవిని వదిలి ఎంపిటిసి స్థానానికి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆమె యంపీపీ అయ్యారు.దీ నితో  మాచినేని పల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఖాళీగా ఉంది. వీటికి ఉపఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఎన్నికల అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి  స్థానిక మండల పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఒక విషయంలో చెప్పాలి అంటే నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అనిపిస్తుంది.

సింగోటం, మాచినేని పల్లి ఓటు జాబితాను గుర్తించిన అధికారులు

కొల్లాపూర్ మండల పరిధిలోని  మాచినేని పల్లి, సింగోటం స్థానానికి  ఎంపీటీసి ఎన్నికలు ఉంటాయి. ఇప్పటికే  సింగోటం, మాచినేని పల్లి, జవాయిపల్లితో కలిపి మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను  అధికారులు గుర్తించారు.ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేశారు. సింగోటం, మాచి నేని పల్లి ఎంపీటీసీ స్థానానికి మొత్తం 3841 ఓట్లు ఉన్నాయి.అందులో మహిళ1946,పురుషుల1895 ఓట్లు ఉన్నాయి.ఇక మాచినేని పల్లి సర్పంచ్ స్థాన్నానికి సంభందించి   635 మంది ఓటర్ లను అధికారులు గుర్తించారు.అదే విధంగా కుడికిల్ల ఒకటి, లచ్చ నాయక్  తండా ఒకటి,ఏల్లూరు రెండు వార్డు నెంబర్ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని కొల్లాపూర్ ఎంపీడీవో కె. మనోహర్ తెలిపారు.ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలతో  వార్డు నెంబర్ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగే విధంగా కనిపిస్తున్నాయి.మొత్తానికి  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచినట్లు  మండల ప్రజా పరిషత్ అధికారి కె.మనోహర్  గురువారం సత్య న్యూస్ కు తెలియజేశారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

కర్నాటకలోనూ మొదలైన లౌడ్ స్పీకర్ల వివాదం

Satyam NEWS

విధానాల రూపకల్పనతోపాటు అమలు కూడా ముఖ్యమే

Satyam NEWS

తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment