30.7 C
Hyderabad
April 29, 2024 04: 08 AM
Slider విజయనగరం

దిశ యాప్ డౌన్ లోడ్ పై విజయనగరం ఎస్పీ యాక్షన్ ప్లాన్…!

#vijayanagaramsp

93 ఏళ్ల వృద్దురాలితో  పోలీస్ బాస్ ముచ్చ‌ట్లు… స‌త్యం న్యూస్ .నెట్ కు చిక్కిన అరుదైన చిత్రం

ఏపీ సీఎం జ‌గన్ మాన‌సిక పుత్రిక అయిన “దిశ” యాప్  పై యావ‌త్ పోలీస్ శాఖ  దృష్టిపెట్టింది. ఆ శాఖ డీజీపీ క‌సిరెడ్డి  రాజేంద్ర నాద్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే దిశ యాప్  డౌన్ లోడింగ్ పై దృష్టి పెట్టాల‌ని వ‌చ్చిన ఆదేశాల‌తో అన్ని జిల్లాల పోలీస్ బాస్ ల‌ను దానిపై దృష్టి పెట్టాయి. అందులో బాగంగా రాష్ట్రంలోని ఉత్త‌రాంద్ర‌లోని అదీ విద్య‌ల జిల్లాగా భాసిల్లిన విజ‌య‌న‌గరం జిల్లా పోలీస్ బాస్…గ‌తంలో దిశ విభాగాన‌కి అదిప‌తి గా ప‌ని చేసిన ఎప్పీ  దీపిక పాటిల్ ఆధ్వ‌ర్యంలో ఒక్క రోజులే దాదాపు 40 వేల మంది తో ల‌క్ష్యంగాదిశ మొబైల్ యాప్ డౌన్ లోడ్ క్యాంపైన్ ప్రారంభించారు.

ఈ మేర‌కు జిల్లా కేంద్రంలోని నెల్లిమర్ల మండలం టెక్కలిలో  గ‌ల సెంచూరియ‌న్ యూనివ‌ర్సిటీ లో రూర‌ల్ సీఐ మంగవేణి ,ఎస్ఐ నారాయ‌ణ  స‌మక్షంలో…దిశ మొబైల్ యాప్ డౌన్ లోడ్ కార్య‌క్ర‌మానికి  శ్రీకారం చుట్టింది..పోలీస్ శాఖ‌.ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో వీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన డౌన్ కార్య‌క్ర‌మానికి ఎస్పీ ముఖ్య అతిదిగా హాజ‌రై మాట్లాడారు.అస‌లు పోలీస్ అన్న ప‌దం ఏంటో..యూనివ‌ర్సిటీ వీసీ  విపుర‌లంగా విశ‌దీక‌రించార‌ని ఎస్పీ దీపిక చెప్పారు.

ముందుంగా యూనివ‌ర్సిటీ వీసీ డా. జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పోలీస్ అంటే…పొలైట్, ఒబిడియంట్, ఇంట‌లెక్చువ‌ల్,ఎఫిషియ‌న్సీ, క‌రేజ్ ల‌తో యావ‌త్ పోలీస్ శాఖ న‌డుతోందని అన్నారు. ఆ దిశగా  ఎస్పీ దీపిక ఆద్వ‌ర్యంలో యావ‌త్ పోలీస్ శాఖ  ముందుడుగేస్తోంద‌ని అందుకు రూర‌ల్ సీఐ ,ఎస్ఐలు ప‌నితీరే  ఓ నిద‌ర్శ‌మ‌న్నారు. 

బిట్స్ పిలానీలో బీటెక్ చేసిన  ఎస్పీ దీపిక‌…ఈ యూనివ‌ర్సిటీలో బీటెక్ స్టూడెంట్స్ అంద‌రికి ఓ దిక్సూచీ  ఓ మార్గ‌ద‌ర్శ‌నమ‌ని వీసీ అన్నారు.అనంత‌రం ఎస్పీ దీపిక్ మాట్లాడుతూ….పోలీస్ అంటే ఏంటో వీసీ బాగా వివ‌రించార‌ని…పోలీస్ అంటే ప్ర‌తీ ఒక్క‌రికీ ఓ ధైర్యం  ఓ అండ అని అన్నారు. 

ఈ దిశ యాప్ ద్వారా ప్ర‌తీ ఒక్క విద్యార్ధినీ,..అమ్మాయి,మ‌హిళ‌..ఉద్యోగిని త‌మ‌ను త‌మా ర‌క్షించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంద‌న్నారు.  దిశ  యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఎస్ఓఎస్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే…మీరెక్క‌డున్నారో..అక్క‌డికే పోలీస్ బృందం మీ వ‌ద్ద‌కే చేరుకుంటుంద‌న్నారు.ఇందుకోసం ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ల‌క్ష్యంగా త‌మ సిబ్బంది ప‌ని చేస్తున్నార‌న్నారు.

ఇక ఉదయం ప‌దకొండు గంట‌ల‌కు యూనివ‌ర్సిటీ దిశ మొబైల్ యాప్ రిజిస్ట్రేష‌న్, మ‌రియు డౌన్ లోడ్ కార్య‌క్ర‌మం అని చెప్ప‌డంతో మీడియా మొత్తం…చెప్పిన స‌మ‌యానికి అక్క‌డికి చేరుకుంది.కాస్సేపు వీసీ ఛాంబ‌ర్ లో కూర్చున్న మీడియా…స‌రాస‌రి  ప‌క్క‌నే ఉన్న ఖాళీ మైదానంలో ఓ టెంట్ వేసి..అక్క‌డే కార్య‌క్ర‌మం నిర్వస్తున్నార‌ని తెలియ‌డంతో..అక్క‌డ‌కు  వెళ్లింది…మీడియా. దాదాపు గంట‌న్న‌ర తర్వాత  యూనివ‌ర్సిటీ వీసీ,ఎస్పీలు..వేదిక‌పైకి రావ‌డంతో కార్య‌క్ర‌మం మొదలైంది.

93 ఏళ్ల వృద్దురాలితో  పోలీస్ బాస్ ముచ్చ‌ట్లు…!

పొరుగు జిల్లా విశాఖ సింహాచ‌లంకు చెందిన  93  మూడేళ్ల వృద్దురాలు…ఈ దిశ  మొబైల్ రిజిస్ట్రేష‌న్ డౌన్ లో్డింగ్  కార్య‌క్ర‌మానికి రావ‌డం విశేషం.గ‌డిచ‌న కొన్ని నెల‌లుగా ఈ తొమ్మిది ప‌దుల వ‌య‌స్సు క‌లిగిన వృద్దురాలు శాంత..ఫిజిక్స్ ఫ్యాకల్టీ  దిట్ట‌. ఇప్ప‌టికీ తాను చ‌దివింది..తాను బోధించింది..తాను చెప్పింది..గుర్తుంచుకుని మ‌రీ  ప్ర‌తీ రోజూ యూనివ‌ర్సిటీకి  వ‌చ్చి విద్యార్ధినీ ,విద్యార్దుల‌కు చెప్ప‌డం విశేషం.

దిశ మొబైల్ యాప్ డౌన్ లోడ్ కార్య‌క్ర‌మంలో స్టేజ్ పై నుంచీ ఆవిడ‌ను చూసి న ఎస్పీ..స‌రాస‌రి ఆవిడ వ‌ద్ద‌కు వెళ్లి…వంగి ప‌ల‌కరించి ఆపై న‌మ‌స్క‌రించి…ఈ వ‌య‌స్సులో కూడా మీరు చ‌దువుకున్న స‌బ్జెక్ట్  మీకు గుర్తుండటం..దాన్ని ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌రీ ఈ యూనివ‌ర్సిటీ విద్యార్ధినీ,విద్యార్దుల‌కు బోధించడం నిజంగా అద్భుత‌మ‌ని ఎస్పీ దీపిక ఆవిడ‌ను కొనియాడారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

చంద్రబాబును వైజాగ్ లో అడ్డుకున్నది పోలీసులే

Satyam NEWS

రాజధానిపై అగ్గి రాజేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

Sub Editor 2

నిర్మల్ లో ప్రారంభమైన సాయుధ పోరాట వారోత్సవం

Satyam NEWS

Leave a Comment