18.7 C
Hyderabad
January 23, 2025 03: 18 AM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్టలో 7న శ్రీకోదండరాముని కల్యాణోత్సవం

ontimitta ramalayam

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వరి 7వ తేదీ శుక్ర‌వారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

Related posts

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

వైభవంగా  శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు

Satyam NEWS

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

mamatha

Leave a Comment