29.7 C
Hyderabad
May 3, 2024 04: 13 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కుక్క కూడా కరవదు…..

#revanthreddy

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రోడ్డు మీద పోయే కుక్క కూడా కరవదు… అలాంటిది ఆయన హత్యకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చారంటా అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి నిర్వహణలో ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన మన ఊరు- మన పోరు బహిరంగ సభ జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు  ఉమ్మడి పాలమూరు జిల్లా టిఆర్ఎస్ నేతలను ఏకిపారేశారు. కొల్లాపూర్ లో అమ్ముడు పోయిన ఓ సన్నాసీ ఏం సాధించావు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కష్టపడి గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకున్న ప్రజల గుండెల మీద తన్ని పోయావు. హర్షవర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇప్పించేందుకు నేను శాయశక్తులా కృషి చేశా. కానీ కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం, కోట్ల కోసం పార్టీ మారిండు అంటూ నిప్పులు చెరగారు. ఏ ముఖం పెట్టుకుని కొల్లాపూర్‌లో తిరుగుతుండు ఆ సన్నాసి అంటూ విరుచుకపడ్డాడు.

ఇక నాగర్‌కర్నూల్‌లో  తిర్రోడో ఎమ్మెల్యే ఉన్నడు. బంకమట్టిని కూడా వదలడం లేదు. అచ్చంపేటలో గువ్వలోడు గబ్బిలాలోడు కూడా అంతే. అల్లంపుర్  అబ్రహాం గురించి నేను చెప్పను. ముందస్తు అంటూ ఆయనే ప్రకటనలు చేస్తున్నడు.

అలంపూర్‌లో మా సంపత్‌కుమార్‌ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఇసుక, మట్టి, భూముల ఆక్రమణలు, గుడి భూముల ఆక్రమణలు చేయడమే ఈ ఎమ్మెల్యేల పనిగా ఉందని ఆయన విమర్శించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంత మందిని బాధపెట్టారో, ఆయన ఎన్ని పాపాలు చేస్తే చంపాలి అనుకున్నారో  అని ఘాటు విమర్శలు చేశారు. ఇక జిల్లా ఎంపీల పరిస్థితి చూస్తే, ‘మంచోడని మంచం ఎక్కిస్తే…. మంచం అంతా పాడుచేసిండంటా..అంటూ విమర్శించారు. పంచే కట్టు కున్న వాడు అంత వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలేడు అంటూ నిరంజన్ రెడ్డి పై రేవంత్ రెచ్చిపోయారు.

Related posts

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS

కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పై లండన్ ఎన్నారైల హర్షం

Satyam NEWS

ప్రజా వినతులను పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment