39.2 C
Hyderabad
May 4, 2024 20: 48 PM
Slider ప్రత్యేకం

పేద ప్రజలంటే కేసీఆర్ కు చిన్నచూపు: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

#shabbirali

సీఎం కేసీఆర్ కు పేద ప్రజలంటే చిన్నచూపు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అందుకే నీట మునిగిపోతాయని తెలిసినా డబుల్ ఇళ్లను అందులోనే నిర్మించారన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షబ్బీర్ అలీ పరిశీలించారు. మోకాలి లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ఇళ్లల్లో ఉంటున్న వారితో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1500 కోట్లతో ప్రగతి భవన్, 15 వేల కోట్లతో సచివాలయం, 5 కొట్లతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు, వందల కోట్లతో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కట్టుకుని ప్రజలను మాత్రం నీటిలో ఉండేలా ఇండ్లు కట్టిస్తారా అని ప్రశ్నించారు. నాణ్యత లేని ఇండ్లు కట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారన్నారు. గతంలో టేక్రియాల్ లో నాణ్యత లేని ఇండ్లను ప్రత్యక్షంగా చూపించానని, ఇప్పుడు నీటిలో మునిగిన రామేశ్వర్ పల్లి డబులు ఇండ్లు చూస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రజలంటే చిన్నచూపు ఎందుకు కేసీఆర్ అని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, కేసీఆర్ ను జైలుకు పంపే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ కు ఓటేస్తామని చేసిన ఏకగ్రీవ తీర్మానాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, రేపటి నుంచి ఆర్టీఏ ద్వారా తీర్మాన కాపీలను తీసుకోబోతున్నామన్నారు. ఏకగ్రీవాలపై హైకోర్టుకు వెళతామన్నారు. కేసీఆర్ కన్ను కామారెడ్డి భూములపై పడిందని, అందుకే తనను ఓడించే వంకతో వస్తున్నారన్నారు. కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ కేసీఆర్ ఓటమి తప్పదన్నారు.

ప్రజలతో మాట్లాడుతున్న షబ్బీర్ అలీ

Related posts

సరిహద్దుల్లో మొహరించి ఉన్న ఎయిర్ ఫోర్స్

Satyam NEWS

25న జరిగే ‘యాదవుల యుద్ధభేరి సభ’ విజయవంతం చేయాలి

Satyam NEWS

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment