27.7 C
Hyderabad
May 4, 2024 09: 58 AM
Slider రంగారెడ్డి

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం

#operationsmile

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆపరేషన్ స్మైల్ VIII సమీక్ష నిర్వహించారు. డీస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, టీం, బచ్ పన్ ఆందోళన్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను రక్షించే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందన్నారు. ఇందులో భాగంగా 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ర్యాగ్ పికర్స్, వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలిస్తామన్నారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయ కారణాల వల్ల బాలలు అణచివేతకు గురవుతున్న వారిని రెస్క్య చేసేందుకు కావాల్సిన సిబ్బందిని, సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఆపరేషన్ స్మైల్ లో పనిచేస్తున్న సిబ్బందికి అదనపు TA అందిస్తానన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి రివార్డులను అందజేస్తామన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్ లో చిన్నారులను ఎలా రక్షించాలనే అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ రాజారెడ్డి, బచ్పన్ బచావో ఆందోళన్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Bhavani

సినీ దర్శకుడు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

Satyam NEWS

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Satyam NEWS

Leave a Comment