42.2 C
Hyderabad
May 3, 2024 18: 07 PM
Slider వరంగల్

వరంగల్ లో అంతర్జాతీయ అంధుల దినోత్సవం

#anitareddy

అంతర్జాతీయ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలలో అంధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా.కె.అనితారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అంధుల ఆరాధ్య దైవమైన లూయిస్ చిత్ర పటానికి పూలమాలవేసి ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ అంధుల సేవ దైవసేవ అని, వీరు కళ్ళు లేకపోయినా మన నేత్రంతో చూడగలరని అన్నారు. వైకల్యం శరీరానికే కాని అది అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కాదని అన్నారు. ప్రతి ఒక్కరు వీరిని ప్రోత్సహించాలని అన్నారు. వీరిపై జాలి చూపడం కాదని వీరికి దారి చూపాలని అన్నారు. ప్రభుత్వం వీరికి ఇచ్చిన రిజర్వేషన్స్ అన్నీ వీరికి సంపూర్ణంగా అందాలని, వీరికి చెందవలసిన బ్యాక్ లాక్ పోస్టులు అన్ని అంధులకు చెందాలని, అప్పుడే నిజమైన అంధుల దినోత్సవం జరుపుకున్నట్లు అవుతుందని అన్నారు. వీరికి ఏ అవసరం వచ్చినా ఓ అమ్మలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలచే పాటలు పాడించారు. పిల్లల ఆటల పాటల పోటీలలో గెలుపొందినవారికి బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శారద, పరమేశ్వర్, గోపికృష్ణ, చంద్రప్రకాశ్, దేవునూరి ఆనంద్ పాల్గొన్నారు.

Related posts

మోడల్ మినిస్టర్: గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లకు పౌష్టికాహార కిట్లు

Satyam NEWS

“స్పందన” ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలి…!

Satyam NEWS

పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి

Satyam NEWS

Leave a Comment