26.7 C
Hyderabad
May 3, 2024 07: 48 AM
Slider ముఖ్యంశాలు

వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

#Orissa bus

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ గుప్తా బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాకు వచ్చే క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు, నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై అప్పటికే కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరి ఉంది.

తెల్లవారు జామున కావడంతో వరద నీరు సరిగా కనిపించక పోవడంతో బస్సు వెళ్లి పోతుందిలే అనే ఉద్దేశ్యంతో డ్రైవర్ వరద నీటిలో నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో రహదారి పక్కకు వెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు.

ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ప్రయాణికులు దిగి నడిచి వెల్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు.

Related posts

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి

Bhavani

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS

బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ

Sub Editor

Leave a Comment