29.7 C
Hyderabad
May 6, 2024 03: 07 AM
Slider నిజామాబాద్

మాస్కులు ధరించని వారికి జరిమానా విధించిన అధికారులు

#CoronavirusMask

బిచ్కుంద మండలంలో మండల కేంద్రంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన ప్రజలు పడకుండా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని అధికారులు ప్రచారం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటే బిచ్కుంద మండల కేంద్రంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని పట్టుకొని అధికారులు జరిమానా విధించి మాస్కులు పంపిణీ చేశారు.

గత మూడు రోజులుగా తాసిల్దార్ వెంకటరావు, ఎస్సై కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొత్తం 84 మంది మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్న వారికి పట్టుకొని 11 వేల 600 రూపాయల జరిమానా విధించారని కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కిరాణా షాపుల వద్ద కూరగాయలు, చికెన్, మటన్, పండ్ల దుకాణాల వద్ద  ప్రజలు భౌతిక దూరం పాటించి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని అన్నారు.

అవసరం ఉంటేనే ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని పని లేకున్నా ద్విచక్ర వాహనాల పైన బయట తిరుగుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని వారు  హెచ్చరించారు. కరోణ మహమ్మారిని తరిమివేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. వారి వెంట రెవెన్యూ, గ్రామపంచాయతీ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Related posts

చంద్రబాబును కలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

Satyam NEWS

ప్రకృతి వైద్యంలో కొత్త పుంతలు తొక్కే శాంతిగిరి

Satyam NEWS

రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్న అధికార పార్టీ

Satyam NEWS

Leave a Comment