33.2 C
Hyderabad
May 15, 2024 23: 02 PM
Slider వరంగల్

సాయంత్రం 6 తర్వాత కూడా మద్యం అమ్మేందుకు ప్లాన్ రెడీ

#Belt shops

మద్యం షాపుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు పనిచేసేలా కనిపించడం లేదు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని లేకపోతే గంటలో పర్మిషన్ రద్దు చేస్తామని నిన్న రాత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉదయం నుంచి ఏ ఒక్క మద్యం షాపు వద్ద కూడా సామాజిక దూరం పాటించడం లేదు.

పోనీ ప్రభుత్వం చెప్పిన సమయాల్లో మద్యం అమ్మకాలు సాగించి ఊరుకుంటారా అంటే అందుకు కూడా తూట్లు పొడిచేందుకు అప్పుడే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. బ్లాక్ దందా పై మద్యం షాపుల నిర్వాహకులు అప్పుడే దృష్టి పెట్టారు.

డిమాండ్ ఉన్నప్పుడే సొమ్ములు కొల్లగొట్టాలి

మద్యం షాపులు గత 45 రోజులుగా మూత పడి ఉండటం తో, మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ధరలు పెంచి అధికారికంగా మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ, కేవలం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని సమయం కేటాయించింది.

అయితే మద్యం వ్యాపారులు గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వాహకులకు మద్యం సరఫరా చేసి, 6 తరువాత విక్రయాలు జరిపి సొమ్ము చేసుకోవాలని జనగామ జిల్లాలోని మద్యం వ్యాపారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైన్స్ తీయడమే ఆలస్యం అన్నట్లు బెల్ట్ నిర్వాహకులతో మద్యం దుకాణంలో సమావేశం ఏర్పరిచారు.

బెల్టు షాపులకు స్టాకు ఏర్పాట్లు

అంతేకాక బెల్ట్ షాపులో ఎక్కువగా అమ్ముడు పోయే బ్రాండ్ల మందును వైన్స్ కు వచ్చే సాధారణ వ్యక్తుల కు ఇవ్వకుండా స్టాక్ లేదని చెబుతున్నారు. పెద్ద బ్రాండ్ ల మద్యం ను మాత్రమే షాపుల్లో విక్రయిస్తున్నారు. సాయంత్రం 6 తరువాత జరిగే మద్యం అమ్మకాల పై నిఘా పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాక మద్యం బెల్ట్ షాపు లకు తరలించకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

పొలంలో నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Bhavani

ఎమ్మెల్యే మేడా ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు

Satyam NEWS

రూ.120 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం విస్తరణ

Satyam NEWS

Leave a Comment