Slider నిజామాబాద్

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

#BJP Armoor

తూకంలో తరుగు తీయడం రైతుల పాలిట శాపంగా మారిందని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ ఆరోపించారు. నుతుల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నేడు ఆయన మచ్చెర్ల ,కుదవంద్ పూర్,మాక్లూర్ గొట్టిముక్కుల గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ప్రతి 40 కిలోల బస్తాకు రెండు కిలోలు తరుగు తీస్తున్నారని, మళ్ళీ ఇది కాకుండా 40 కిలోల బస్తాకు రైస్ మిల్లర్లు కూడా ఒకటి లేదా రెండు కిలోలు తరుగు తీస్తామని చెబుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. ఇలా తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే వడ్ల సంచులను తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు ఎక్కడా రైతులకు ప్రభుత్వం చెప్పిన వసతులు కల్పించలేని వినయ్ అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద టెంట్లు గాని, త్రాగునీరుగానీ అందడం లేదని రైతులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వరి ధాన్యం కుప్పలు పోసి ఇప్పటికే 20 రోజులు అవుతున్నా అధికారులు రాకపోవడం అన్యాయమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పాలెపు రాజు, లోక నర్సారెడ్డి, ప్రసాద్, ముప్పేడ గంగారెడ్డి, MPTC రవి కూడా పాల్గొన్నారు.

Related posts

పంజరంలో చిలక

Satyam NEWS

సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు చలానా

Satyam NEWS

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS

Leave a Comment