42.2 C
Hyderabad
May 3, 2024 18: 03 PM
Slider ముఖ్యంశాలు

పొలంలో నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

#Minister Srinivas Goud

హన్వాడ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న క్రమంలో హన్వాడ మండలం చిన్నదర్పల్లికి చెందిన బాలకిషన్ రావు అనే రైతు పొలంలో వరి నాట్లు వేస్తుండగా అది గమనించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కాన్వాయ్ ని రోడ్డు పక్కన పెట్టి పొలంలో దిగి నాగలితో పొలం దున్ని గొర్రుతో కరిగెట చేశారు. అనంతరం ఎరువు చల్లారు.

మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఉచితంగా నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలని అన్నదాతను ఆగం చేసేందుకు కుట్ర చేస్తోందని అక్కడున్న రైతులతో మంత్రి పేర్కొన్నారు.

ఇక స్వయంగా మంత్రి పొలంలో దిగి నాటు వేయడంతో రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Related posts

ఎనదర్ బ్లో: ఏపి ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కార నేరం?

Satyam NEWS

హ్యాట్సాఫ్ : ఉదారత చాటుకున్న అక్క చెల్లెళ్లు

Satyam NEWS

ఫ్రాడ్ కేసులో మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment