39.2 C
Hyderabad
May 4, 2024 19: 57 PM
Slider నల్గొండ

హుజూర్‌నగర్ లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి

#hujurnagar municipality

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిబంధనల ప్రకారం స్లమ్ ఏరియాలో 5 వేల నుండి 10 వేల జనాభా ఉంటే ఖచ్చితంగా బస్తీ దవాఖానా(అర్బన్ హెల్త్ కేర్ సెంటర్)ఏర్పాటు చేయాలని ఉందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అజీజ్ పాషా అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో అజీజ్ పాషా మాట్లాడుతూ హుజూర్‌నగర్ మండల పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయని, చుట్టు ప్రక్కల గ్రామాల వారు చికిత్సలు చేయించుకోవడానికి ఇక్కడికే వస్తారని ఆయన తెలిపారు. సుమారు 10 నుండి 15 కిలోమీటర్ల మేర దూర ప్రయాణం అవుతుందని, ప్రతి నెలా రెండు సార్లు గర్భిణీ స్త్రీలు చెకప్ కు వెళ్ళటానికి ప్రయాణ భారం తో పాటు ఆర్థిక భారం పడుతుందని అన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ పట్టణంలో సుమారు 60 వేల పైచిలుకు జనాభా, మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పట్టణంలో స్లమ్ ప్రాంతాలైన  గోవిందాపురం, హరిజన వాడ, అంబేద్కర్ కాలేని, తిలక్ నగర్, ఎన్టీఆర్ నగర్, చింతల బజారు లాంటి ప్రాంతాల్లో

బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీని వలన స్లమ్ ఏరియాల్లో ఔట్ పేషెంట్ కి అన్ని రకాలుగా  ఇది ఉపయోగపడుతూ ప్రతిరోజు డాక్టర్లు ఔట్ పేషెంట్ కు సలహాలు,సూచనలు వైద్యం అందిస్తుంటారని అన్నారు.గర్భిణీ  స్త్రీలు లింగగిరి పి.హెచ్.సి కి వెళ్లకుండా  ఇక్కడే వైద్య చికిత్సలు చేయించు కోవటానికి పూర్తిగా పట్టణంలో అందుబాటులో ఉంటుందని అన్నారు.

బస్తీ దవాఖానా డయాగ్నాసిస్  టెస్టులు

క్యాన్సర్ వంటి,నాన్ కమ్యూనికబుల్  వ్యాధికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ కరోనా టెస్టు,  చికెన్ గున్యా పాటు ఇంకా కొన్ని టెస్టులు ఉచితంగా చేయబడతాయని ఆయన అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి  అందుబాటులో ఉంటూ సుమారు 40 రకాల పైన డయాగ్నస్టిక్ టెస్టులూ ఉచితంగా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

అదే ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి టెస్టులు,ట్రీట్మెంట్ కి హాస్పిటల్ కు వెళ్లాలంటే వేల రూపాయల ఖర్చు,ఆర్థిక భారం ప్రజలపై పడుతుందని అజీజ్ పాషా అన్నారు.ఈ పరిస్థితిని నివారించి మెరుగైన వైద్యం ప్రజలకు అందించడానికి హుజూర్ నగర్ పట్టణంలో బస్తీ దవాఖాన (అర్బన్ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ నాయకులుముశం సత్యనారాయణ,జక్కుల మల్లయ్య,ఎస్.కె. బిక్కన్ సాబ్,బాచిమంచి గిరిబాబు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు వెల్దండ వీరారెడ్డి, తేజావత్ రాజా,కారింగుల వెంకటేశ్వర్లు,పాశం రామరాజు, మేళ్లచెరువు ముక్కంటి,దొంతగాని జగన్,ఎస్.కె.అజ్జూ,కోల మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.రఘునాథ్ ను సత్కరించిన పెందోట శ్రీనివాస్

Satyam NEWS

పిల్లవాడి ప్రాణం తీసిన దాగుడుమూతలు

Bhavani

వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ

Satyam NEWS

Leave a Comment