37.7 C
Hyderabad
May 4, 2024 13: 17 PM
Slider విజయనగరం

“సామాజిక న్యాయభేరి”కి విస్తృత బందోబస్తు: పది సెక్టార్లలో పోలీసు బందోబస్తు

#police

రాష్ట్ర మంత్రులు చేపట్టిన “సామాజిక న్యాయ భేరి” కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాకు రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. రాష్ట్ర మంత్రులు జిల్లాలో ప్రవేశించే ప్రాంతంకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించి, ఒక్కొక్క సెక్టరుకు ఇన్స్పెక్టరు లేదా డిఎస్పీ స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించామన్నారు. జిల్లాలోకి ప్రవేసించే కందివలస వద్ద బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు, విజయనగరం పట్టణంలో జరిగే మీటింగు స్థలం వద్ద విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్ బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారన్నారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగు, వాహనాల డైవర్షన్ ఏర్పాట్లును పర్యవేక్షించేందుకు ట్రాఫిక్డి ఎస్పీ ఎల్.మోహనరావును నియమించామన్నారు. సామాజిక న్యాయ భేరిలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వాహనాల్లో రానున్నందున ఆయా వాహనాలకు పార్కింగు స్థలాలలను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇప్పటికే జిల్లా ఎస్పీ ఎం. దీపిక మంత్రుల “సామాజిక న్యాయ భేరి” నిర్వహించే ప్రాంతాలను, మార్గాన్ని పరిశీలించి, బందోబస్తు, చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమావేశమై, సమీక్షించారు. వాహనాల మళ్ళింపు, ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల26 మధ్యాహ్నం 3 గంటల నుండి మీటింగు ముగిసే వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఈ ఆంక్షలను గమనించి, పోలీసు వారికి సహకరించాల్సిందిగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు.

పార్కింగు స్థలాలు

విజయనగరం పట్టణంలో వాహనాల పార్కింగుకు (1) రాజీవ్ క్రీడా ప్రాంగణం (2) నెహ్రూ పార్కు (3) పాత ట్రాఫిక్ పోలీసు స్టేషను (పెద్ద పోస్టాఫీసు రోడ్డు) (4) అయోధ్య మైదానం (5) సంగీత కళాశాల వద్ద పార్కింగు స్థలాలను ఏర్పాటు చేసామని, ఆయా ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగు చేసుకోవాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.

వాహనాలను నిలుపుదల చేసే ప్రాంతాలు

సామాజిక న్యాయ భేరిలో పాల్గొనేందుకు వచ్చే ప్రజల వాహనాలను (1) ఎం.ఆర్. కళాశాల జంక్షన్ (2) కన్యకా పరమేశ్వరి ఆలయ జంక్షన్ (3) గంట స్థంభం (4) ఫైర్ స్టేషను (5) సిటీ బస్టాండు సమీపంలోగల గణేష్ కోవెల (6) పార్క్ గేటు వద్ద ప్రజల వాహనాలను నిలుపుదల చేసి, మీటింగు ప్రాంతంకు వెళ్ళే వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

ట్రాఫిక్ డైవర్షన్స్

“సామాజిక న్యాయ భేరి”లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నామన్నారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల నుండి మీటింగు ముగిసే వరకు అమలవుతాయని, ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాల్సిందిగా జిల్లా ఎస్పీ కోరారు.

కలెక్టరాఫీసు జంక్షన్ నుండి బాలాజీ మార్కెట్, గూడ్సు షెడ్, సి.ఎం.ఆర్. జంక్షన్ వరకు ‘వన్ వే’ అమలులో ఉంటుంది. వన్ వే కారణంగా సి.ఎం.ఆర్. జంక్షన్ నుండి కలెక్టరేటు ఎటువంటి వాహనాలను అనుమతించరు.

‘సామాజిక న్యాయ భేరి’ కి వచ్చే ప్రజల వాహనాలను మాత్రమే ఎస్బీఐ మెయిన్ జంక్షన్ నుండి రామా నాయుడు రోడ్డులోకి అనుమతిస్తారు.

గజపతినగరం, బొబ్బిలి వైపు నుండి వచ్చే వాహనాలను జె.ఎన్.టి.యు. జంక్షన్, గాజులరేగ, బీసెంట్ స్కూలు, పాత బస్టాండు మీదుగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పార్కింగుకు అనుమతిస్తారు.

నెల్లిమర్ల, చీపురుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలను కొత్తపేట నీళ్ళ ట్యాంకు, మండపం జంక్షన్, పాత బస్టాండు మీదుగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పార్కింగుకు అనుమతిస్తారు.

భోగాపురం, డెంకాడ వైపు నుండి వచ్చే వాహనాలను రాజీవ్ నగర్ జంక్షన్, దాసన్నపేట రింగు రోడ్డు, కొత్తపేట, మండపం జంక్షన్, పాత బస్టాండు మీదుగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పార్కింగుకు అనుమతిస్తారు.

గంట్యాడ, ఎస్.కోట వైపు నుండి వచ్చే వాహనాలను కలెక్టరాఫీసు, బాలాజీ మార్కెట్, గూడ్స్ షెడ్, సి.ఎం.ఆర్. జంక్షన్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, రామానాయుడు రోడ్డు మీదుగా అయోధ్య మైదానంలో పార్కింగ్ కు అనుమతిస్తారు.

Related posts

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Murali Krishna

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కఠిన నిర్ణయం

Satyam NEWS

విజయవాడలో నంది అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS

Leave a Comment