38.2 C
Hyderabad
May 3, 2024 21: 02 PM
Slider కడప

వలసకూలీలకు డబ్బులు ఎగ్గొట్టిన మునిసిపల్ కాంట్రాక్టర్

#Maigrent Labour

కడప జిల్లా కమలాపురంలో పంచాయితీ పనులు చేయించుకుని ఇప్పటి వరకూ కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో వలసకూలీలు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వారు పోలీసులకు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. ఇటీవల కమలాపురం గ్రామ పంచాయితీ నుంచి నగర పంచాయతీ అయింది.

ఆ సందర్భంగా జరిగిన అభివృద్ధి పనులలో భాగంగా 22 కోట్ల 40 లక్షల రూపాయలతో సైడు కాలువలు నిర్మించారు. ఈ పనులు చేసేందుకు బీహార్ నుంచి కూలీలు ను తీసుకువచ్చారు. అయితే లాక్ డౌన్ కారణంగా పనులు నిలిచిపోయాయి. దాంతో కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు.

ఈమేరకు ఆ వలసకూలీలు పొలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించి తమను సొంత ఊరికి చేర్చాలని 34 మంది వలసకూలీలు వేడుకుంటున్నారు.

Related posts

వందన సమర్పణ

Satyam NEWS

చైనా సరిహద్దు లో సూర్యాపేటకు చెందిన కల్నల్ మృతి

Satyam NEWS

Professional What Natural Herbs Are Good For High Blood Pressure

Bhavani

Leave a Comment