42.2 C
Hyderabad
April 26, 2024 18: 36 PM
Slider మహబూబ్ నగర్

కరోనా హెల్ప్: ఇబ్బందులు పడుతున్న అర్చకులకు సాహిత్యం

#Kalwakurthy Brahmins

వివిధ దేవాలయాల్లో అర్చకులుగా పని చేస్తున్న బ్రాహ్మణులకు అవోపా కల్వకుర్తి (ఆర్యవైశ్య వృత్తి ఉద్యోగ సంఘం) వారు సాహిత్యం అందచేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఆలయాలకు భక్తులు రాకపోవడం వల్ల అర్చకులకు పూట గడవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యలో వారిని ఆదుకోవాలని సంకల్పించిన అవోపా కల్వకుర్తి వారు నేడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్య వైశ్య కుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో సాహిత్యాన్ని అందజేశారు.

ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా దేవాలయాలకు భక్తుల తాకిడి లేకపోవడంతో దేవాలయాలలో అర్చకత్వం నిర్వహిస్తున్న వారికి  రోజులు గడవడం  కష్టం గానే ఉందని భావించిన అవోపా సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అవోపా అధ్యక్షులు ఎలిశెట్టి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 9 దేవాలయాలలో పని చేస్తున్న 12 మంది అర్చకులకు సాహిత్యం అందచేసినట్లు ఆయన తెలిపారు.

అందులో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు అవోపా సంఘం కోశాధికారి పాలుట్ల జంగయ్య, విజయ భాస్కర్ ,సంబు ప్రభాకర్ ,నరసింహయ్య ,సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, గౌరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబర్ 12 నుంచి బాలోత్సవ్

Murali Krishna

ఎనాలసిస్: కరోనా నేర్పిస్తున్న కొత్త పాఠాలు

Satyam NEWS

దోచుకున్నది దాచుకున్నది ఎవరో తేల్చేందుకు సిద్ధమా?

Satyam NEWS

Leave a Comment