దిశ ఘటనకు సంబంధించి మృతురాలి గుర్తింపు, ఆమె ఫోటోలు, ప్రసారం చేయరాదని విన్నవించినా పట్టించుకోని మీడియా హౌజ్‌లపై చర్యలకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. గుర్తించిన టీవీ చానెల్స్, సోషల్‌మీడియా వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మృతురాలి వివరాలు ప్రసారం చేయవద్దని సైబరాబాద్ కమిషనర్ సూచించారు. అయినా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె ఫోటోలు తొలగించకపోవడంతో పాటు ఛానెళ్లలో ఇప్పటికీ కొంతమంది పేర్లు, ఫోటోలు వాడుతుండడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
దర్యాప్తులోని అంశాలనూ ప్రసారం చేయడాన్ని తప్పు బట్టిన పోలీసులు 149 సీఆర్‌పీసీ కింద మీడియాకు నోటీసులు జారీ చేయనున్నారు.