33.2 C
Hyderabad
May 4, 2024 01: 24 AM
Slider ఖమ్మం

బంగారు, వెండి పతకాలు సాధించిన పోలీసు జాగిలాలు

#spktdm

తెలంగాణ,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ జాగిలాలకు గత సంవత్సరం జూన్ మాసం నుండి ఈనెల 16వ తేదీ వరకు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ నందు శిక్షణ ఇప్పించడం జరిగింది.8 నెలల శిక్షణ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన గ్రేసి బంగారు పతకాన్ని,రెండవ స్థానంలో నిలిచిన రీనా వెండి పతకాన్ని గెలుచుకున్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించబడిన నార్కోటిక్స్ విభాగంలో శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ డా.వినీత్ ఈ సందర్భంగా తెలియజేసారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రేసీ,రీనాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.పోలీసు జాగిలాల సంరక్షణకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సిబ్బందికి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,ఆర్ఐలు దామోదర్,సోములు మరియు ఏఆర్ ఎస్సై పెంటోజిరావు,హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీరా(రీనా హాండ్లర్),కానిస్టేబుల్ వెంకటేష్(గ్రేసీ హాండ్లెర్) తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్ కుమారుడికి మేడిపల్లి సత్యం పరామర్శ

Satyam NEWS

MLA క్వార్టర్స్ ఘనంగా అయ్యప్ప పడిపూజ

Bhavani

జగనాసుర రక్త చరిత్ర బహిరంగం పుస్తకంతో జనంలోకి ‘దేశం’

Bhavani

Leave a Comment