29.7 C
Hyderabad
May 6, 2024 04: 34 AM
Slider ఖమ్మం

పోడు పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలి

#dckothagudem

పోడు పట్టాల పంపిణీ ప్రక్రియలో మొదటి విడతలో పట్టాలు పంపిణీ చేయనున్న  44 వేల ఎకరాల లబ్ధిదారుల పాస్ ఫోటోలతో పాటు విస్తీర్ణంలో సవరణలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తహసీల్దార్లను, ఎంపిడిఓలను ఆదేశించారు.  ఐడిఓసి కార్యాలయం నుండి పోడు పట్టాలు జారీలో ఫోటోలు, విస్తీర్ణంలో  వచ్చిన వ్యత్యాసాలను  సరిచేయు  అంశంపై తహసీల్దార్లు, ఎంపిడిఓలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా విచారణ పూర్తయిన 44 వేల ఎకరాలకు పట్టాలు జారీ చేసేందుకు అప్లోడ్ లో  ఫోటోలు సరిగా లేనివి, విస్తీర్ణంలో వ్యత్యాసాలు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు.  పాలిగన్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పారు. సాగదీయొద్దని రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికావాలని ఆయన స్పష్టం చేసారు. తుది జాభితాపై తహసీల్దార్, ఎంపీడీఓ సంయుక్త ధ్రువీకరణ చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ అశోక్ చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలతఅన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సహాయ కార్యక్రమాల్లో ఎన్జీఓలను భాగస్వామ్యులను చేయాలి

Satyam NEWS

స్వాతంత్య్రం కోల్పోయిన అఫ్ఘానిస్థాన్ ప్రజలు

Satyam NEWS

1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment