36.2 C
Hyderabad
May 7, 2024 14: 05 PM
Slider విజయనగరం

“చల్లని” వాతావరణం లో పోలీసు“స్పందన”…!

#police

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి,

వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 31 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

బొండపల్లి మండలం రుద్రపాలెం కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాము గ్రామంలో ఇంటిని నిర్మిస్తుండగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని, తనకు న్యాయం

చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, సమస్య పరిష్కారమయ్యే విధంగా చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి తో 2010లో వివాహం జరిగిందని, అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఈ విషయమై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసు స్టేషనులో కేసు నమోదయ్యిందని, విదేశాల్లో ఉన్న తన భర్తను పిలిపించి, న్యాయం

చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ మహిళా పిఎస్ డిఎస్పీనిఆదేశించారు.

చీపురుపల్లి మండలం మెట్టపల్లి కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన తండ్రి ద్వారా తనకు 0-22 సెంట్లు భూమి సంక్రమించిందని, సదరు భూమిని తన అన్నదమ్ములు తనకు చెందకుండా అడ్డుకుంటున్నారని, న్యాయం

చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరు వర్గాలతో మాట్లాడి, చట్ట పరిధిలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని చీపురుపల్లి సిఐని ఆదేశించారు.

జామి మండలం భీమసింగి కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఆర్మీలో పని చేసినట్లు, 2016లో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు, సదరు భూమిని ఆక్రమించేందుకు తన బంధువులు ప్రయత్నిస్తున్నట్లు,

న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరు వర్గాలతో మాట్లాడి, డాక్యుమెంట్లును పరిశీలించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్. కోట సిఐను ఆదేశించారు.

తెర్లాం మండలం అంట్లవార కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బాడంగికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడుకి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, 5 లక్షలు తీసుకున్నట్లు, సదరు వ్యక్తి ఇప్పటి వరకు

ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి రూరల్ సీఐను ఆదేశించారు.

దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలస కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం కు చెందిన ఒక నగలు షాపు యజమానికి పెండ్లి నగలు చేయించేందుకుగాను 2.42 లక్షలు ఇచ్చినట్లు, సదరు వ్యక్తి ఇప్పటి వరకు తనకు నగలు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట

పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయ నగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.ఇలా “స్పందన” లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారులైన బాధితులు

సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సిఐ జె. మురళి, ఎస్బీ సీఐ జి. రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ లు పాల్గొన్నారు.

Related posts

మునుగోడు గెలుపే లక్ష్యంగా పువ్వాడ దళం

Murali Krishna

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani

ములుగు జిల్లాలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment