27.7 C
Hyderabad
May 4, 2024 08: 34 AM
Slider గుంటూరు

అంతరించిపోతున్న కళలను బ్రతికించుకోవాలి

#prajanatyamandali

ప్రజా పోరాటాలకు కళాకారులు వెన్నంటి ఉండాలని అంతరించిపోతున్న కళలను బతికించుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని దేశంలో మతోన్మాద దాడులు పెరిగిపోయాయని ఈ విధానాలపై కళాకారులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని పిలుపునిచ్చారు.

శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కొలనకొండలోని ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కంచర్ల కాశయ్య అధ్యక్షతన వారి నివాసంలో సుప్రసిద్ధ ప్రజా కళాకారుడు రంగస్థల సినీ నటులు దర్శకులు ప్రజానాట్యమండలి నిర్మాతల్లో ఒకరు అయిన డాక్టర్ గరికపాటి రాజారావు 60వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా గరికపాటి రాజారావు చిత్ర పటానికి ప్రజానాట్యమండలి కళాకారులు,  అభ్యుదయవాదులు కళాకారులు కవులు సిపిఐ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం జరిగిన వర్ధంతి సభలోముఖ్య అతిధులుగా పాల్గొన్న ఇఫ్తా జాతీయ కార్యదర్శి గని  దేశంలో, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై హత్యలు, లైంగికదాడులు పెరిగిపోతూ, మానవ సంబంధాలు నశించిపోయాయన్నారు. దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయన్నారు. పాలకులు పేద, దళిత మహిళలపై దాడులను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తూ.. చట్టాలను తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ ప్రజా కళాకారులు ప్రత్యమ్నాయ ప్రజాసంస్కృతిని నిర్మించాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజలు సంఘటితమైన ప్రజాస్వామిక హక్కుల కోసం కళారూపాల ద్వారా పోరాటం చేయాలని సూచించారు. గరిక పాటి రాజారావు ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేశారని అన్నారు.

నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారని చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారని అన్నారు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందారని అన్నారు.

ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కంచర్ల కాశయ్య మాట్లాడుతూ గరికపాటి రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించారని ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశారని అన్నారు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నారని అన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదని పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవారని అన్నారు.

పలువురువక్తలు మాట్లాడుతూ గరిక పాటి రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడని మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించారని అన్నారు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించిందని . షాజహాన్‌గా ఎస్‌విఆర్ సాంబశివరావు, జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారని అన్నారు.

వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తానే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసారని కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించారని అన్నారు. ప్రజా కళాకారులను కళలను బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాకారులు అభ్యుదయవాదులు కవులు గుంటకసాంబిరెడ్డి, తుడిమెల్ల వెంకటయ్య, చిన్నసత్యనారాయణ, గంజి వెంకయ్య, బోర్లా శ్రీనివాసరావు,శీలం శ్యామ్,శీలం అనిల్,హనోక్, దొంత కోటేశ్వరరావు, సందుపట్ల భూపతి,రేఖా కృష్ణార్జున బోధి,గోలి మధు, కారుమంచి రామారావు,నన్నపనేని నాగేశ్వరరావు, మంచా విజయ మోహన్ రావు, ఆకురాతి మురళీకృష్ణ,ఆకు రాతి రత్నారావు, రామ్మోహన్రావు,ఆకుతి శంకరరావు,లక్ష్మణరావు,అనిల్ కుమార్, ఆకురాతి వెంకటరత్నం, పోటాబత్తుని లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టం

Satyam NEWS

నో సిఏఏ: ఆలా చేస్తే పదవికి రాజీనామా చేసేస్తా

Satyam NEWS

సెన్సార్ పూర్తి చేసుకున్న “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Satyam NEWS

Leave a Comment