Slider విజయనగరం

ధర్నాలతో దద్దరిల్లిన విజయనగరం కలెక్టరేట్

#aisf

ఓ వైపు తమ ,తమ సమస్యలను కలొక్టోరుకు విన్నవించంకునేందుకు వస్తున్న బాధితులు.. మరోవైపు… తమ ,తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ,అగ్రిగోల్డ్ బాధితులతో విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆరుబయట ప్రాంగణం దధ్ధరిల్లిపోయింది.సరిగ్గా అనుకున్న..ఇచ్చిన సమయానికే ఏఐఎస్ఎఫ్ నేతలు.. కొన్ని కాలేజీల విద్యార్థులను తీసుకుని కలెక్టరేట్ అవుట్ గేట్ ముంగిట ధర్నా కు దిగింది.

ఎలిమెంఠరీ స్కూల్లో జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు.. అందరికీ విద్య అన్న విధానానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయంటూ ధర్నా కు దిగింది. ప్రాధమిక విద్యతో పాటు కాలేజీ విద్యపచ కూడా ప్రభుత్వం లేనిపోని పెత్తనం చలాయించేందుకే ఆ సంస్కరణలని ధ్వజమెత్తింది.పేదలకు విద్య ను దూరం చేసే ఆలోచనలతోనే కార్పొరేట్ విధ్యను జగన్ ప్రభుత్వం తీసుకొస్తోందని ఏఐఎస్ఎఫ్ తీవ్ర స్థాయిలో విమర్శించింది. తక్షణమే ఆ అడ్డగోలు సంస్కరణలను అమలు చేయోద్దని…పేదోడి కి సర్కారు విద్యను దూరం చేయొద్దని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.

Related posts

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా ఇవ్వాలి

Murali Krishna

ప్రజల ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి

Satyam NEWS

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గుర‌జాడ‌కు నివాళి

Satyam NEWS

Leave a Comment