40.2 C
Hyderabad
April 29, 2024 16: 04 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్‌లో ఏడీపీ ఇండియా 23 వ వార్షికోత్సవం

ADPIndia

సుప్రసిద్ధ హ్యూమన్‌ రిసోర్శెర్స్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌, సేవల ప్రదాత ఏడీపీ ఇండియా తమ 23వ కంపెనీ డే వేడుకలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించింది.  కొవిడ్‌–19 కారణంగా రెండు సంవత్సరాలుగా రిమోట్‌గా వర్క్‌ చేస్తున్న 4వేల మందికి పైగా అసోసియేట్లు నిబద్ధత, సహకారం, వృద్ధికి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వేడుక చేసుకున్నారుయ్యారు. ఉద్యోగులతో అనుబంధాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఏడీపీ ఇండియా యొక్క వార్షిక కంపెనీ డే, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటుగా సంస్థ విజయాన్ని, సంస్ధ వృద్ధిలో తోడ్పాటునందించిన అసోసియేట్ల తోడ్పాటును గుర్తించేలా వేడుకలను నిర్వహించింది.

1999లో 102 మంది అసోసియేట్లతో తమ కార్యకలాపాలను ప్రారంభించింది.  ఈ 22 సంవత్సరాలలో  ఏడీపీ ఇండియా అసాధారణంగా వృద్ధి చెందడంతో పాటుగా 10500 మంది అసోసియేట్లతో  కూడిన కుటుంబంగా మారింది.  హెచ్‌సీఎంలో మార్కెట్‌ లీడర్‌గా,  ఉద్యోగులు, తమ ఖాతాదారుల వద్ద ఒకే తరహా సంతృప్తిని ఏడీపీ ఆస్వాదిస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమంలో, ఏడీపీ ఇండియా  తమ వార్షిక వేడుకలను ముందుగానే ఆఫీసులో ప్రారంభించింది. ఆఫీసులో డెకరేషన్‌ చేయడంతో పాటుగా భౌతికంగా, వర్ట్యువల్‌గా క్విజ్‌లను ఏర్పాటుచేయడం, స్కావెంజర్‌ హంట్‌, సెల్ఫీ బూత్స్‌ మరెన్నో ఉత్సాహపూరితమైన కార్యక్రమాలను అసోసియేట్లతో నిర్వహించింది.

కరోనా కారణంగా వేడకలను నిలిపివేశాం..

ఈ పండుగ కార్యక్రమం ఏడీపీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జాన్‌ ఆయల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. హాజరైన ఉద్యోగులను చూసి తన సంతోషాన్ని వ్యక్తీకరించిన  ఏడీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ వేములపల్లి మాట్లాడుతూ  ‘‘గత కొద్ది సంవత్సరాలుగా నేను కోల్పోయిన అంశం ఏదైనా ఉందా అని అంటే, మా ఏడీపీ కుటుంబంతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం. మా అసోసియేట్‌లు మరియు క్లయింట్‌ల కోసం ఎల్లప్పుడూ మెరుగైన మార్గాలను రూపొందించాలనే ఏడీపీ యొక్క లక్ష్యానికి మా  అసోసియేట్లు జోడించే విలువ, హృదయం, జీవితం, స్థిరత్వం మరియు ప్రేమకు ఈ దృశ్యం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మనల్ని హృదయపూర్వకంగా ఆవిష్కరించడానికి ప్రేరేపించిన ప్రతిదానిని తిరిగి చూసుకోవడానికి ఇది ఓ గొప్ప అవకాశం మరియు భారీ సంఖ్యలో అసోసియేట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడమనేది మనం ఎలా సరళీకృతం చేస్తాము, ఆవిష్కరిస్తాము మరియు సమిష్టిగా గెలువడానికి ఎలా ఎదగాలన్నది సూచిస్తుంది’’ అని అన్నారు.

వైవిధ్యభరితంగా సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ సాయంత్రం పలు  సాంస్కృతిక కార్యకలాపాలు సైతం జరిగాయి. వీటిలో వినూత్నమైన అంతర్గత ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటితో పాటుగా కంపెనీ మ్యూజిక్‌ గ్రూప్‌ ఏడీపీ స్టూడియో ప్రత్యేక  ప్రదర్శనలను సైతం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల ప్రదర్శన నిలిచింది.  ఏడీపీ ఇండియా సీఎస్‌ఆర్‌ కార్యక్రమం తరంగ్‌ ద్వారా లబ్ధిపొందిన చిన్నారులే వీరంతా.  ఏడీపీ ఇండియా విజయంలో తోడ్పాటునందించిన వ్యక్తులు, ప్రాజెక్టులకు వార్షిక ఎక్స్‌లెన్స్‌ అవార్డులను కంపెనీ అందించడంతో పాటుగా ప్రత్యేక గుర్తింపుతో ప్రశంసా పత్రాలనూ అందజేసింది.

ఈ సందర్భంగా డివిజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌  డాక్టర్‌ విపుల్‌ సింగ్‌ మాట్లాడుతూ  ‘‘ఏడీపీ కోసం గర్వకారణమైన క్షణంగా ఈ  మైలురాయి నిలుస్తుంది. కలిసికట్టుగా విజయం సాధించాలనే మన కీలక విలువను ఇది గుర్తు చేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా  మా నిరంతర వృద్ధి,శారీరక, మానసిక మరియు ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించడం ద్వారా మున్ముందు అనేక మైలురాళ్లను చేరుకోగలమనే నమ్మకం కలిగించింది. ఏడీపీ ఉద్యోగుల నిబద్ధత, ఆవిష్కరణ, మద్దతు ద్వారా ఈ రంగంలో నాయకులుగా మేము వెలుగొందగలమని భావిస్తున్నాము. సమిష్టిగా సాధించిన విజయాన్ని వేడుక చేసే కార్యక్రమమది. మా వైవిధ్యమైన అసోసొయేట్లకు  సహాయక, సమ్మిళిత, ప్రగతిశీల వాతావరణాన్ని  ఏడీపీ ఇండియా కొనసాగిస్తుంది’’ అని అన్నారు. ఈ వార్షిక కార్యక్రమం డీజె డ్యాన్స్‌ ఫ్లోర్‌ గాలా డిన్నర్‌తో  ముగిసింది.

Related posts

మల్దకల్ లో ఘనంగా తులసి కళ్యాణం

Satyam NEWS

కారణం చెప్పి.. రామన్న కంటతడి

Satyam NEWS

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి

Satyam NEWS

Leave a Comment