40.2 C
Hyderabad
May 5, 2024 16: 20 PM
Slider నల్గొండ

కార్పోరేట్ వైద్యశాలలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి

#Azizpasha

18 నుండి 45 సంవత్సరాల వయసు గల వారికి ఉచితంగా వ్యాక్సిన్  వేయాలని TPCC  జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు.

కరోనా ను ఆరోగ్యశ్రీ లో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారని, పక్క రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ  కరోనా ను  ఆరోగ్యశ్రీలో చేర్చారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లు,ఆక్సిజన్, వెంటిలేటర్స్ కొరత లేకుండా పూర్తిస్థాయిలో  సమకూర్చాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్యూనిటీ,ఇతర భవనాలను ప్రభుత్వం  ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి కరోనా నుండి ప్రజలను కాపాడాలని కోరారు.

కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చకపోతే ప్రజలు క్షమించరని, శాసనసభ సాక్షిగా ఆరోగ్యశ్రీ లో చేర్చుతామని చేసిన వాగ్దానం అమలు చేయాలని అన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చి,అట్టి ప్రజలు కరోనా తో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నించారు.

కార్పోరేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ నిఘా, నియంత్రణ లేని చందంగా ఉందని,వారిని ప్రభుత్వమే  పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు ఉందని అజీజ్ పాషా విమర్శించారు. ప్రభుత్వం వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఎంత మేరకు పని చేస్తున్నాయో దీనిని బట్టే అర్థం అవుతుందని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న కార్పోరేట్ హాస్పిటల్స్ వారు ఇదే అదునుగా భావించి  కరోనా  బాదితుల వద్ద మానవత్వాన్ని విస్మరించి ప్రజలను పీడించి లక్షల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు.

కరోనా తో మరణిస్తున్న వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని, కార్పోరేట్ వైద్యశాలలలో లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేకనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, కేసీఆర్ ఇకనైనా ప్రజల ఆరోగ్య విషయంలో స్పందించాలని కోరారు.

మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు తో పాటు మరికొన్ని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే కార్పోరేట్ హాస్పిటల్స్  అన్నింటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఉచితంగా అందరికీ వైద్యసేవలు అందిస్తున్నారని,అదే తరహాలో తెలంగాణా రాష్ట్రంలో కూడా అమలు చేసి  కార్పొరేట్ హాస్పటల్స్ అన్నింటిని ఆధీనంలోకి తీసుకొని వైద్యసేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, ఇట్టిమల్ల బెంజిమెన్,SK. బిక్కన్ సాహెబ్,రజాక్ బాబా,SK. మోహిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కారు ఢీకొని ఒకరి మృతి: బాధితుల ధర్నా

Satyam NEWS

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS

సామాజిక పెన్షన్లు తక్షణమే అందివ్వాలి: చంద్రబాబు డిమాండ్

Satyam NEWS

Leave a Comment