39.2 C
Hyderabad
May 3, 2024 13: 17 PM
Slider తూర్పుగోదావరి

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు

#hospital

కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొన్ని ఆసుపత్రుల తీరు మారడం లేదు.

కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొన్ని ఆసుపత్రుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోగులకు ఫీజులు వేస్తున్నాయి. ఆసుపత్రి స్టాంప్ కూడా లేకుండా తమకు తోచినంత ఫీజును వసూలు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్ సోకడమే కాదు.. కోలుకుని వస్తోన్న రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక కరోనా పేరుతో ఆస్పత్రిలో చేరితే అంతే సంగతులు.. మినిమం 2 నుంచి 3 లక్షలు వసూల్ చేయడం కామన్. జాయిన్ అయ్యే సమయంలో రూ.1 లక్ష నుంచి.. 2, 3 లక్షల వరకు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు.

ఇటీవల అయినవిల్లి మండలం చింతనలంక‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్ సోకి అమలాపురం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రోజుకు యాభై వేలు అన్నారు. గత్యంతరం లేక రెండు లక్షలు అడ్వాన్స్ కట్టి జాయిన్ చేశారు. పేషెంట్ బాగానే రికవరీ అయ్యాడు. ఇప్పుడు ఇంకో నాలుగు లక్షలు కడితేగానీ డిశ్చార్జ్ చేయమంటున్నారు. ఆసుపత్రి వారు  మధ్యతరగతి కుటుంభం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.

తీసుకెళ్ళకపోతే రోజుకో యాభై వేలు ఎక్స్ ట్రా… కోలుకోవడం ఎలా ఉన్నా..ఈ ఫీజును తలచుకొని పేషెంట్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. కుటుంబసభ్యులు ధైర్యం చెప్పి డబ్బుల వేటలో పడ్డారు. కోవిడ్ సోకడం దేవుడెరుగు. వచ్చిన తరువాత ఎంత డబ్బవుతుందో, బెడ్ దొరుకుతుందా లేదా..ఈ రెండే రెండు కారణాలతో చాలా ప్రాణాలు గాల్లో‌ కలిసిపోతున్న పరిస్థితి.. అంతేకాదు కంప్యూటరైజ్డ్‌ బిల్లులో ఆసుపత్రి పేరు కూడా లేదని చెప్పారు. వారికి తోచినంత డబ్బులను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు, అలాగే పేరును బయటకు రాకుండా చూసుకుంటున్నారు అంటూ ఆ వ్యక్తి చెబుతున్నారు. కాగా ఇవొక్కటే కాదు చాలా ఆసుపత్రులు బిల్లులో జీఎస్టీ ఛార్జీలను చూపడం లేదు.

బిల్ కడితేనే పంపుతాం:

రూ.4 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో బాధితుడి బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్‌ బాధితుడికి ఐసీయూకు రూ. 5వేలు, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7వేలు, సాధారణ వార్డుకు రూ.4వేలు చొప్పున మాత్రమే తీసుకోవాలి. కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ దోపిడీకి అడ్డుపడేదేలా?

కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల దోడిపీడి అడ్డు లేకుండా పోతోందని విమర్శలు ఉన్నాయి. అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా ట్రీట్ మెంట్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంత అమౌంటే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

కానీ, కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలే కరోనా సంక్షోభంలో అంతా ఆర్థికింగా చికితిపోయి ఉన్నారు. ఇప్పుడు లక్షల లక్షల బిల్లులు వేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు.

కరోనా కష్టకాలంలో రోగులకు అండగా నిలవాల్సిన ఆసుపత్రులు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు దండుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఎండ్ ఆఫ్ ట్రేడ్ వార్: చైనాతో వాణిజ్య ఒప్పందం ఓకే

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

నిన్నటి వరకూ క్లాసులు చెప్పిన టీచర్లు వీరు…

Satyam NEWS

Leave a Comment