33.2 C
Hyderabad
May 4, 2024 00: 25 AM
Slider ఖమ్మం

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

#cpm

అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల రుణం ఇవ్వాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు.  సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 29వ డివిజన్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని స్థానిక సమస్యలు కూడా పరిష్కరించాలని  అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల ని కోరుతూ ఈరోజు స్థానిక ప్రకాష్ నగర్ ఆటో స్టాండ్ దగ్గర నుండి పాదయాత్ర ను సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రారంభించారు . ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సభలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ లు మాట్లాడుతూ బిజెపి పాలన వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మోడీ ప్రభుత్వం రాకముందు గ్యాస్ ధర 400 రూపాయలు ఉండేది ఇప్పుడు 1150 రూపాయలు అయింది అంతేకాకుండా పెట్రోలు డీజిల్ ధరలు కూడా 65 రూపాయలు ఉన్న పెట్రోల్ 115 రూపాయలకు చేరుకుంది అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ధరలు పెరిగిపోయాయో ఈ రెండింటిని చూసుకుంటే బేరీజు వేసుకుంటే ప్రజలకు అర్థమవుతుందని అలాగే ఈ దేశంలో మతోన్మాద దాడులు ఎక్కువైతున్నాయని ముస్లింల పైన క్రిస్టియన్ల పైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తినే తిండి పైన కూడా కట్టుకునే బట్టపై కూడా ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్రలు వేస్తున్నారని జైల్లో పెడుతున్నారని ఆయన అన్నారు

వీటన్నిటికీ సిపిఎం అన్ని మండలాల్లో వార్డులలో డివిజన్లో ల లో పాదయాత్రలు జరుగుతున్నాయని మోడీ విధానాలను ఎండగడుతున్నామని ఆయన అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం మార్చుకోకపోతే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు చేస్తుందని అలాగే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఈ పాదయాత్ర ప్రకాష్ నగర్ ఆటో స్టాండ్ నుండి ఎరుకల కాలనీ, ఎస్సీ కాలనీ ఎఫ్సీఐ రోడ్డు, సుందరయ్య నగర్ మీదుగా సుందరయ్య పార్కు వద్ద ముగిసింది ఈ పాదయాత్రలో 250 మంది మహిళలు 150 మంది పురుషులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  వై విక్రమ్ ,సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, వజేనేపల్లి శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, ఎస్ కే సైదులు, షేక్ హీమామ్, శీలం వీరబాబు, నాయిని నరసింహారావు, హెచ్ వెంకటేశ్వర్లు, హెచ్ పీరయ్య, నల్ల మాస వీరస్వామి, తాళ్లూరి రామకృష్ణ, భూక్య సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్ లకు కుచ్చుటోపీ పెట్టిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

ఇంత అసమర్థ అధికారులు ఏ డివిజన్ లో ఉండరు

Satyam NEWS

విజయా డైరీ ప్రైవేట్ పరం ఆలోచన లేదు

Satyam NEWS

Leave a Comment