స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ తమ కేంద్రం నుంచి పౌరసత్వ సవరణ చట్టం పై చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించింది. ఆ ప్రకటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. రామకృష్ణ మఠంలో మత పరమైన వ్యాఖ్యలు చేయడం నిషిద్ధం.
రాజకీయ పరమైన కార్యకలాపాలకు రామకృష్ణా మిషన్ దూరంగా ఉంటుంది. పౌరసత్వ చట్టం ఎవరికైనా పౌర సత్వం ఇవ్వడానికి తప్ప తీసేయడానికి కాదని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న బేలూరులోని రామకృష్ణ మఠాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ వద్ద అన్ని రకాల మతాల వారూ ఉంటారని, తాము మత ప్రాతిపదికన అంశాలను చూడమని రామకృష్ణ మిషన్ పేర్కొంది. అంతే కాకుండా రాజకీయ పరమైన వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించేది లేదని వారు స్పష్టం చేశారు.
రామకృష్ణన్ మిషన్ ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద మాట్లాడుతూ ప్రధాని పౌరసత్వ చట్టంపై చేసిన ప్రకటన తమకు సంబంధించినది కాదని అన్నారు. స్వామి సువిరానంద మాట్లాడుతూ తమది పూర్తిగా రాజకీయేతర సంస్థ అని తెలిపారు. రామకృష్ణ మఠంలో ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతం సన్యాసులు కూడా ఉన్నారని, వారు ఒకే తల్లిదండ్రుల బిడ్డల్లా సోదరుల వలె జీవిస్తారని ఆయన అన్నారు. రాజకీయ వ్యాఖ్యలకు తమ వేదిక ఉపయోగించుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.