27.7 C
Hyderabad
April 30, 2024 10: 27 AM
Slider ముఖ్యంశాలు

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన

#cpm

కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కమిటీ ఆధ్వర్యంలో తిలక్ నగర్ చౌరస్తాలో మహిళలతో కట్టెలమోపు ఎత్తుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై అనేక భారాలు మోపుతుందని అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎలక్షన్లు పూర్తవగానే వంటగ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచేసి 1155 వరకు చేసిందని, ఇప్పటికి అనేక ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడతా ఉంటే, ప్రపంచ మార్కెట్లో ధరలు అదుపులో ఉన్న, మోడీ మాత్రం హిడెన్ బర్గ్ నివేదికతో సర్వం కోల్పోయిన తన మిత్రుడు  అదాని కోసం ప్రజల నడ్డి విరిచే విధంగా వంట గ్యాస్ ధరలు పెంచుతున్నారని, మరొక వైపు మోడీ ఫ్రెండ్స్ దేశ సంపదను కొల్లగొట్టి వారి ఖజానా  నింపుకుంటుంటే మరోవైపు మోడీ మాత్రం ధరలు పెంచి కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నాడని అన్నారు.

ఒకవైపు ధరలు పెంచుతూ మరోవైపు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతూ హిందువులు ప్రమాదంలో ఉన్నారని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని ఇప్పటివరకు మోడీ బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి ఇసుమంత కూడా పనిచేయలేదని పేదవారి పై  ధరలు పెంచి పెద్దలకు దోచిపెట్టడం తప్ప ఇంతవరకు మోడీ చేసింది ఏమీ లేదని వారు విమర్శించారు

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట జోన్ నాయకులు జి రాములు, బి సుబ్బారావు, ఎల్ సోమయ్య, డిఎల్ మోహన్, వరలక్ష్మి, నాగమ్మ, పర్వతాలు, మంగమ్మ, డి.బీరమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

4723 చెక్కులకు గాను రూ.20.27కోట్ల పంపిణీ

Murali Krishna

ఏ పార్టీ అయినా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వస్తే ఖబర్దార్

Satyam NEWS

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు

Satyam NEWS

Leave a Comment