34.7 C
Hyderabad
May 5, 2024 00: 13 AM
Slider ప్రత్యేకం

జై గుడివాడ: కాసినో నడిపిన వారికి రామ్ గోపాల్ వర్మ పూర్తి ‘‘మద్దతు’’

#ramgopalvarma

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఏకవచన ప్రయోగంతో ప్రాముఖ్యత పొందిన మంత్రి కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్ కామెంట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని కె కన్వెన్షన్ హాల్ లో కాసినో నిర్వహించారని, రూ.500 కోట్లు చేతులు మారాయని, మంత్రి కొడాలి నానినే దానిని దగ్గరుండి నడిపించారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొడాలి నానిని విమర్శిస్తున్న పిచ్చి వాళ్లంతా.. గుడివాడ ప్రజలు గోవా వెళ్తారు గానీ గోవా వారు గుడివాడ రారన్న విషయాన్ని తెలుసుకోవాలంటూ ట్వీట్ చేశారు. గుడివాడను ఆధునికీకరించాలన్న నాని తపనను ప్రశంసించాలని అన్నారు.‘‘గుడివాడకు కేసినో తీసుకొచ్చిన నాని గురించి మాట్లాడే వారంతా.. గుడివాడను మళ్లీ చీకటి యుగంలోకి నెట్టేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. పారిస్, లండన్, లాస్ వేగాస్ కు పోటీగా గుడివాడను నిలిపిన నానిని తప్పకుండా అభినందించాల్సిందే. గుడివాడలో కాసినో వస్తే.. ఎవరైనా గోవా, లాస్ వేగాస్ ల వైపు చూస్తారా? గుడివాడను ఆధునికీకరించాలన్న నాని ఆలోచనకు నేను మద్దతిస్తున్నా. కాసినో గురించి మాట్లాడేవారంతా తిరోగమనవాదులే.. జై గుడివాడ!’’ అంటూ వర్మ ట్వీట్లు చేశారు.

Related posts

‘ఊర్వశి’ విడుదల: ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’

Satyam NEWS

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

Satyam NEWS

బాలికల అనాధ బాల సదనంకు కలెక్టర్ శర్మన్ విరాళం

Satyam NEWS

Leave a Comment