38.2 C
Hyderabad
April 28, 2024 20: 06 PM
Slider రంగారెడ్డి

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

#vikarabad

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో ఓటరు జాబితాలోని మార్పులు, చేర్పులు, డబుల్ బెడ్ రూమ్,  ఇసుక రవాణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించి ఓటరు జాబితాలో చేర్చాలని అన్నారు.  ‌

ఎన్నికల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలని, ఓటర్ జాబితాలో తొలగించబడిన వాటి వివరాలను పనః పరిశీలించి  సరిచేయలని సూచించారు. ఏవేని నమోదు,  అభ్యంతరాలకు  సంబంధించి ఫిర్యాదులు ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.  ఒక ఇంటిలో ఆరు మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి ఓటర్ జాబితాలో కావాల్సిన మార్పులను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. అన్నదమ్ములు విడిపోయినట్లయితే వాస్తవంగా ఉంటే ఇంటికి బై నెంబర్లు ఇచ్చి ఓటర్ జాబితాలో చేర్చాలని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా తరచుగా రాజకీయ పార్టీల ఇన్చార్జిల సమావేశం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరగకూడదని కలెక్టర్ తెలిపారు. ఇసుక అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వ , ప్రైవేటు పనుల అవసరాలకు క్యూబిక్ మీటర్ 600 రూపాయలకే ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇసుకను కచ్చితంగా ట్రాక్టర్ల ద్వారానే తీసుకువెళ్లాలని తెలిపారు.  రాత్రి సమయాల్లో,  సెలవు దినాల్లో ఇసుకను తరలించకూడదని తాసిల్దార్లకు సూచించారు.  నిబంధనలను అధిగమించి ఇసుక రవాణా చేసినట్లయితే అట్టి వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తాసిల్దార్ లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని తెలిపారు. ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగిన తాసిల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట నష్టానికి నిధులు మంజూరు కావడం జరిగిందని బాధితులకు గుర్తించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కూలిపోయిన ఇండ్లకు,  చనిపోయిన పశువులకు నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ల ధ్రువీకరణను పూర్తి చేసి జాబితాలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వాటిని నిర్లక్ష్యం చేయకుండా, పెండింగ్ లో లేకుండా  ప్రత్యేక డ్రైవ్  నిర్వహించి లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా అధికారుల కృషి ఉండాలని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లకు వాస్తవికంగా అర్హులైతే  అట్టి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.

టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డిఆర్ఓ సురేష్ కుమార్, వికారాబాద్ ఆర్టీవో విజయ కుమారి లు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS

తెలంగాణ ఇచ్చింది సోనియా కబ్జా పెట్టింది కేసీఆర్

Satyam NEWS

జగన్ అక్రమాస్తుల కేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం..!

Satyam NEWS

Leave a Comment