29.7 C
Hyderabad
April 29, 2024 10: 32 AM
Slider మెదక్

తెలంగాణ లో 2 కోట్ల టెస్టింగ్ కిట్ లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్ లు

#ministerharishrao

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా జనరల్ వార్డు, పిల్లల వార్డు, కరోనా టెస్టుల కేంద్రాన్ని సందర్శించారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణులతో మంత్రి ఈ సందర్బంగా మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కే సి ఆర్ కిట్ల గురించి అడిగి తెల్సుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు, కేసీఆర్ కిట్లు నయా పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు చెప్పారు. మగ బిడ్డ పుడితే రు. 12000, ఆడ బిడ్డ పుడితే రు. 13000 అందించడంతో పాటు, 16 వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఆటో కిరాయి ఖర్చు లేకుండా గర్భిణులు కోసం అమ్మ ఒడి సేవలు సిద్దంగా ఉన్నాయన్నారు. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.

కరోనా పరీక్ష కేంద్రం వద్ద పరీక్షలు చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా చేస్తున్న పరీక్షలు, అందిస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్ లో ఉన్న మందులను వాడుతూ దైర్యంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, సోకిన వారు ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉందన్నారు.

అలా అని నిర్లక్ష్యం చేయవద్దని కరోనా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సబ్ సెంటర్, పి హెచ్ సి స్థాయి నుంచి అన్ని ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో లో వంద పడకల కరోనా వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

గజ్వేల్ వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది కి మంత్రి ప్రశంస

గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. ఆసుపత్రిలో నెలకు 400 డెలివరీ లు చేస్తున్నారనీ తెలిపారు. గజ్వేల్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే పసిరికలు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర వార్డు చక్కగా పని చేస్తుందన్నారు. వైద్యులు పిల్లలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు.

Related posts

జగన్ గారూ, హెలికాప్టర్ వద్దండి… కారులో తిరగండి

Satyam NEWS

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

డెత్ వారంట్: నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి ఖరారు

Satyam NEWS

Leave a Comment