27.7 C
Hyderabad
May 4, 2024 09: 25 AM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మకు దిమ్మదిరిగే షాక్

1559481043_ram-gopal-varma

రాజకీయ వికృత చిత్రాలు తీసి సొమ్ము చేసుకునే రామ్ గోపాల్ వర్మ ప్రయత్నానికి ఈ సారి బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నది. రేపు విడుదల కావాల్సిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం సెన్సార్ నేటి సాయంత్రం వరకూ కాలేదు. అత్యవసరంగా సమావేశం అయి రాత్రికి రాత్రి సెన్సార్ చేసినా కూడా రేపు సినిమాను విడుదల చేయడం అనుమానంగానే ఉంది. అంత యుద్ధ ప్రాతిపదికన సెన్సార్ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు.

మరో వైపు ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిలించేదిగా ఉన్న టైటిల్ ను మార్చాలని హైకోర్టు విచారణ సందర్భంగా సూచించగా ఇప్పటికే టైటిల్ ను మార్చమని రామ్ గోపాల్ వర్మ కోర్టుకు తెలిపారు. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్న రామ్ గోపాల్ వర్మ అభ్యర్ధనను పరిశీలించిన హైకోర్టు, వారం రోజుల్లో సినిమా ను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కు ఆదేశం ఇచ్చింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని  సెన్సార్ కు హైకోర్టు సూచించింది.

Related posts

విశ్వకర్మ మహాసభ తెలంగాణ బాధ్యుడిగా రాజమౌళి చారి

Satyam NEWS

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ‌లాధివాసం

Satyam NEWS

Leave a Comment