38.2 C
Hyderabad
April 29, 2024 20: 18 PM
Slider గుంటూరు

నరసరావుపేటలో విజయవంతంగా జాబ్ మేళా

gopireddy

నిరుద్యోగ యువతీ యువకుల కు జాబ్ మేళా  ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నరసరావుపేట ఏమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం టౌన్ హాల్ లో గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఆలివ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. గతం లో కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం దురదృష్టకరం అన్నారు.

అయితే ఆలివ్ ఫౌండేషన్ వారు గతం లో ఐదు జిల్లాలో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించారని గోపిరెడ్డి తెలిపారు. ఈ ఆలివ్ కంపెనీ మాత్రం యువతీ యువకులకు ఇంటర్వ్యూ నిర్వహించి సాయంత్రం కల్లా కాల్  లెటర్ ఇచ్చి వారం రోజుల లోపు ఉద్యోగాలు కలిపిస్తున్నటు స్పష్టం చేసారు. ఈ జాబ్ మేళా లో మూడు వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారని తెలిపారు.

16  కంపెనీల తో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించటానికి ఆలివ్  సంస్థ ముందుకు వచ్చింది అని తెలిపారు. గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు ,అభివృద్ధి గురించి అడిగే వారి సంఖ్య కంటే తమ పిల్లల ఉపాధి గురించి అడిగే వారి సంఖ్య ఎక్కువైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన మూడు నెలల లోపే నాలుగు లక్షల మందికి ఉపాధి కలిపించారని గోపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను జనవరి ,ఫిబ్రవరి మాసాల్లో భర్తీ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.

వైకాపా పట్టణ అధ్యక్షుడు కాకుమాను బాల హనుమంత రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లుగానే నరసరావుపేట స్థాయిలో ఎంఎల్ఏ గోపిరెడ్డి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఈ కార్యక్రమంతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఎంతో లాభం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో   ఆలివ్ నిర్వాహకులు చింతపల్లి మురళి ప్రసాద్ , కే వి రమణ , ,మిట్టపల్లి రమేష్ ,ఖాజావళీ ,సుజాత పాల్ ,పిల్లి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ

Satyam NEWS

కరోనా మందుల పేరుతో మోసంపై కేంద్రానికి సుప్రీం నోటీసు

Satyam NEWS

అచ్చన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment