రాజధాని అమరావతి మార్పుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు నిరసన ర్యాలి నిర్వహించారు. గుంటూరు,కృష్ణ జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని జేఏసీ కన్వీనర్, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన అరవింద బాబు మాట్లాడుతూ అమరావతి మీద వైసీపీ మంత్రులు అసత్యాలు చెబుతున్నారు. అమరావతి మీద మంత్రుల మాటలు దుర్మార్గంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అమరావతి భూముల మీద ఆదాయంతో అమరావతి నిర్మాణం చెయ్యొచ్చు. కానీ జగన్ ప్రభుత్వం అవేవీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
విశాఖలో వైసీపీ నేతల భూ దందా చేయడానికి రాజధాని అంటూ హడావుడి మొదలు పెట్టారని ఆయన అన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు. ఈ ప్రాంత వైసీపీ నేతలకు జగన్ అంటే భయం అందుకే కోట్లాది ప్రజలను రోడ్డు మీద పడేశారు. రైతులకు అండగా టిడిపి, జేఏసీ ఉంది అని ఆయన అన్నారు.