35.2 C
Hyderabad
April 30, 2024 23: 42 PM
Slider హైదరాబాద్

విశ్వకర్మ మహాసభ తెలంగాణ బాధ్యుడిగా రాజమౌళి చారి

#rajamoulichari

కోల్‌కతా వేదికగా 1968లో ఏర్పాటు చేసిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ దేశంలోని అన్ని రాష్ట్రాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ముఖ్యంగా విశ్వకర్మీయులకు బాసటగా అనేక కార్యక్రమాలను చేపట్టి, చైతన్యపరుస్తున్నది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కొత్త ప్రెసిడెంట్‌ను నియామకం జరిగింది. సీనియర్ పాత్రికేయులు బి.రాజమౌళి చారిని తెలంగాణ రాష్ట్రానికి కొత్త బాధ్యుడిగా ప్రకటిస్తూ, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకున్నది.

ఇందులో భాగంగానే జర్నలిస్టు రాజమౌళి చారికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన బాధ్యుడిగా నియమించడం జరిగింది. విశ్వకర్మ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ శర్మ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజమౌళి చారిని తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం జాతీయ స్థాయి మహాసభ నాయకులు సుభాష్ చంద్రబోస్, ముఖ్య సలహాదారు చిన్మయాచారి, మహాసభ జాతీయ పరిశీలకులు రామ్‌రాజ్ విశ్వకర్మ, కృష్ణ ప్రసాద్ విశ్వకర్మల సమక్షంలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇకమీదట సీనియర్ పాత్రికేయులు రాజమౌళి చారి నాయకత్వంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ కార్యకలాపాలు సాగుతాయని నేషనల్ ప్రెసిడెంట్ అశ్వనీకుమార్ శర్మ ప్రకటించారు. విశ్వకర్మ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభవృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన ప్రోత్సాహాలకు సంబంధించిన అంశాలపై రాజమౌళి చారి కృషి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలకు సంబంధించి అనేక సంఘాలు పనిచేస్తున్నాయని, వారి ఆశీస్సులు, సహకారం కూడా రాజమౌళి చారికి అందంచాలని అశ్వనీకుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Related posts

సీఎం రాజీనామా

Bhavani

ఆంధ్రప్రదేశ్ లో 20,000 క్వారంటైన్‌ పడకలు సిద్ధం

Satyam NEWS

గుర‌జాడ  ఆడిటోరియం…మ్యూజీయం సంగ‌తేంటి..?

Satyam NEWS

Leave a Comment