36.2 C
Hyderabad
May 14, 2024 15: 31 PM
Slider ఖమ్మం

సకాలంలో సెంటర్ కు చెరుకోవాలి

#Group-4 examination

జూలై -1న ఉదయం 10 గంటల నుండి 12-30 గంటల వరకు , మధ్యాహ్నం 2-30 నుంచి 5 గంటల వరకు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో, ముందస్తుగా పరీక్షా సెంటర్లకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ఉదయం 8 గంటల నుండి 9-45 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2-15 గంటల వరకు పరీక్షా సెంటర్ లోనికి అనుమతి ఉంటుందని, సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని, అభ్యర్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని రావద్దని, ఒరిజినల్ హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ వ్యాలిడిటి ఫోటో ఐ.డి.

గుర్తింపు కార్డ్ (ఆధార్ కసర్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లేదా ఏదేని ఫోటో గుర్తింపు కార్డు) తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో 163 పరీక్షా కేంద్రాలలో 49 వేల 781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళే సమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపనున్నందున అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లు వెంట తీసుకొని రావద్దని అభ్యర్థులకు తెలిపారు.

అభ్యర్థులు హల్ టికెట్ పై ఫోటో, సంతకం చెక్ చేసుకోవాలని, హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేని పక్షంలో గెజిటెడ్ అధికారి ధృవీకరించిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రావాలని లేనిపక్షంలో పరీక్షకు హజరు కాలేరని జిల్లా కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఓ.ఎం.ఆర్. షిట్ పై సూచనలు చదవాలని, ఓఎంఆర్ బబ్లింగ్ లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని, హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నా పత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని, ప్రశ్న పత్రంలో 150 ప్రశ్నలను సరి చూసుకోవాలని, 150 ప్రశ్నలు లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ కు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.

పరీక్షా హల్ లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగుతుందని, చివరి 5 నిమిషాలను సూచిస్తూ వార్నింగ్ బెల్ మోగుతుందని, దీనికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాయాలని కలెక్టర్ తెలిపారు. ఓఎంఆర్ షిట్ పై వైటనర్, ఎరెజర్, వివిధ రకాల ట్యాంపరింగ్ పాల్పడితే ఆ ఓఎంఆర్ షిట్ చెల్లదని, పరిక్షా కేంద్రాల్లో ఇతరులతో మాట్లాడటం, ఇతరులను డిస్ట్రబ్ చేయకూడదని, పరీక్ష ముగిసిన తరువాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Related posts

దుష్ప్రచారానికి పాల్పడుతున్న ప్రాంతీయ పార్టీలు

Bhavani

మసీదు నిర్మాణానికి వేరే చోట 5 ఎకరాల చోటు

Satyam NEWS

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి

Satyam NEWS

Leave a Comment