అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. వివాదాస్పద భూమి మొత్తం రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించింది. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానమైన ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్స్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొన్నది. వివాదస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో ఇచ్చిన అలహాబాద్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. 2.77 ఎకరాల భూమిని అయోధ్యకు వెంటనే అప్పగించాలని, వివాదస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్ కు కేటాయించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఎలాంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించింది. వివాదస్పద స్థలంలో రామమందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు. రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవి. రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది అని ఆయన అన్నారు. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డ్ నిరూపించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని ఆయన తెలిపారు.
previous post
next post