37.7 C
Hyderabad
May 4, 2024 12: 41 PM
Slider హైదరాబాద్

భాగ్య‌న‌గ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి

Election Code

జీహెచ్ఎంసి ఎన్నిక‌ల ప్రకటన నేప‌థ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో 4 వేల‌కు పైగా పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు తొల‌గించిన‌ట్టు జీహెచ్ఎంసి ఎన్నికల అధికారి, క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, భ‌వ‌నాలు, ప్ర‌హ‌రీగోడ‌లు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు.

న‌గ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డానికి సర్కిళ్లవారీగా నిఘా బృందాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశామ‌ని డి.ఎస్.లోకేష్ కుమార్ వివ‌రించారు.

Related posts

సినీనటుడు రాజశేఖర్ డ్రయివింగ్ లైసెన్సు రద్దు

Satyam NEWS

వేములవాడ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం

Satyam NEWS

బలివె వచ్చిన భక్తులకు ఆహార వితరణ సేవ

Satyam NEWS

Leave a Comment