40.2 C
Hyderabad
May 5, 2024 15: 30 PM
Slider నిజామాబాద్

రైతు ఆత్మహత్య ఎఫెక్ట్.. రాజీనామాల పర్వం

#kamareddy

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతులు తమ ఉద్యమ కార్యాచరణ తీవ్రతరం చేశారు.

నేడు అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతి పాలకవర్గం సభ్యులు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ లక్ష్మీపతి, వార్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, అనూష, స్వప్న, సుశీల, రోజా తో పాటు పిఏసీఎస్ డైరెక్టర్ భాస్కర్, గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగించాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

రైతు కుటుంబాల భారీ ర్యాలీ

ఇదిలా ఉండగా నేడు రైతు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టేందుకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్న అడ్లూర్, ఇల్చిపూర్, లింగాపూర్, టెక్రియల్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడానికి జిల్లా కేంద్రానికి బయలుదేరారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించేందుకు నిర్ణయించారు. రైతుల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు

కుటుంబ సభ్యులతో ర్యాలీకి బయలుదేరుతున్న రైతులు

Related posts

ఉపాధి హామీ పనులను గుర్తించండి ఎంపిడిఓ ఆనంద్

Satyam NEWS

నిత్యావసరాలు ధరలు ఇలా పెరిగితే బతికేది ఎలా?

Satyam NEWS

మృతుల కుటుంబాలకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పరామర్శ

Satyam NEWS

Leave a Comment