40.2 C
Hyderabad
May 6, 2024 15: 33 PM
Slider ప్రత్యేకం

పిసిసి అధ్యక్షుడు రేవంత్ పై సీనియర్ల అసత్య ప్రచారం

#malluravi

సేవ్ కాంగ్రెస్ పేరుతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశమైన సీనియర్ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేశారని సీనియర్లు ఆరోపిస్తున్నారు.

అయితే ఇందులో కాంగ్రెస్ శ్రేణులు నమ్మదగిన విషయాలు ఏవీ లేవని మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పని చేసేవారితోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి ఎంతమందికి స్థానం కల్పించారో మీ ముందు ఉంచుతున్నాను..అంటూ ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. డాక్టర్ మల్లు రవి తెలిపిన వివరాలు ఇవి:

1. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 22 మంది సభ్యులు గాను ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే టిడిపి నుంచి వచ్చిన వారు.

2. 40 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  సీనియర్ కార్యవర్గంలో టిడిపి నుంచి వచ్చినవారు కేవలం ఇద్దరు. వారు ధనసరి సీతక్క..వేం నరేందర్ రెడ్డి.

3. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 24 మంది ఉన్నారు. వారిలో 4గురు మాత్రమే టిడిపి నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన వారు.  అందులో దొమ్మాటి సాంబయ్య, విజయ రమణారావు,పొట్ల నాగేశ్వరరావు, తోటకూర జంగయ్య యాదవ్ ఉన్నారు. ఇద్దరు మాత్రం ఇటీవల భాజపా నుండి వచ్చినవారు. వారు బండ్రు శోభారాణి, ఎర్ర శేఖర్.

4. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 26 మంది డిసిసి అధ్యక్షులను ప్రకటించగా అందులో 7 గురు కొత్తవారికి అవకాశం ఇవ్వగా వారు కూడ కాంగ్రెస్ వారే తప్ప టిడిపి నుంచి వచ్చిన వారు లేరు.

5. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 84 మందిని ప్రకటిస్తే టిడిపి నుంచి వచ్చిన వారికి 6 గురికి అవకాశం కల్పించడం జరిగింది. అందులో పటేల్ రమేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చారకొండ వెంకటేష్.. చిలుక మధుసూదన్ రెడ్డి.. సత్తు మల్లేష్..శశికళ యాదవ్ ఉన్నారు.

6.మొత్తం ఇప్పటివరకు ప్రకటించిన కార్యవర్గంలో కేవలం 13 మందికి మాత్రమే టిడిపి నుండి వచ్చిన వారికి పనిచేసే సమర్థులకు  అవకాశం కల్పించడం జరిగింది అని ఆయన వెల్లడించారు.

టీపీసీసి రాష్ట్ర కార్యవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వారికి 68 శాతం పదవులు ఇవ్వగా ఓసీలకు 32% ఇవ్వడం జరిగింది.. సామాజిక న్యాయం పరంగా బీసీ లు 29%, ఎస్సీలు 18%, మైనారిటీలు 13%, ఎస్టీలు 8%, ఓసీలు 32% కేటాయించారు…పూర్తిస్థాయి సామాజిక న్యాయం కి అవకాశం ఇవ్వడం జరిగింది అని ఆయన వివరించారు.

Related posts

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

Satyam NEWS

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

Satyam NEWS

ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారో…..?

Satyam NEWS

Leave a Comment