42.2 C
Hyderabad
May 3, 2024 17: 05 PM
Slider ప్రత్యేకం

ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారో…..?

#someshkumar

తెలంగాణ ముఖ్యమంత్రి ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న సోమేష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ లో పని చేయడంపై చాలా కాలంగా వివాదం నడుస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ మేరకు దాఖలైన కేసుల్లో క్యాట్ సోమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆయన ఇంత కాలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అయితే క్యాట్ ఆదేశాలను కొట్టివేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.

సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు తనకు సమయం కావాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు సమయం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తీర్పు కాపీ అందగానే రిలీవ్ కావాలని కోర్టు ఆదేశించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా సత్వర చర్యలు తీసుకున్నది. తక్షణమే తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

తక్షణమే సోమేష్ కుమార్ తెలంగాణ సర్వీస్ ల నుంచి వైదొలిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమేష్ కుమార్ కు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఏడాది కాలంలో రిటైర్ కాబోతున్న సోమేష్ కుమార్ కు ఇది పెద్ద షాక్ లాంటిదే. సోమేష్ కుమార్ ఇప్పుడు ఏపికి వెళ్లి జాయిన్ అయితే అక్కడ ఇంత సీనియర్ పోస్టు లభ్యం కాదు.

ఆయనకు ఉన్న సీనియారిటీ ప్రకారం పోస్టింగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి ఏపికి వెళ్లి అక్కడ ఒక శాఖకు పని చేయడం అవమానంగా భావిస్తారు. అందువల్ల ఆయన ఏపిలో జాయినింగ్ రిపోర్డు ఇచ్చి సెలవులో వెళ్లిపోవచ్చు. రిటైర్ అయ్యేవరకూ ఆయన సెలవులో ఉండాల్సి వస్తుంది. ఏడాదిలో రిటైర్ కాబోతున్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తారనేది ప్రశ్నార్ధకమే.

Related posts

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏం చేయాలి? నాగార్జున విసిని అడగండి

Satyam NEWS

సర్టిఫికెట్: ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

ECIL బస్ టెర్మినల్ ఎదురుగా U టర్న్ డివైడర్ మళ్లీ కూలిపోయింది…

Satyam NEWS

Leave a Comment