Slider హైదరాబాద్

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

#muralidhararao

భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమాన్ని గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం శేర్లింగంపల్లి గోపి నగర్ హనుమాన్ దేవాలయం ఆవరణలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ప్రభారి మురళీధర్ రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు లింగంపల్లి డివిజన్, గోపి నగర్ లో 78,79,81 బూత్ ల శక్తి కేంద్ర ఇంచార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో  నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో  మురళీధర్ రావు మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, గడిచిన 9 ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఒక్క ఇంటిని కూడా ఎవరికి కేటాయించకుండా గుడిసెలలో బ్రతుకుతున్న పేదవారిని రోడ్డున పడేసారన్నారు. చెరువుల సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే వారి అనుచరులు కబ్జాలు చేస్తున్నారని, నాలా విస్తరణ కు 132 కోట్లు కేటాయించామని చెప్పారు, ఏ నాలా విస్తరణ చేశారో  చెప్పాలని, చూపించాలని డిమాండ్ చేశారు.

దళిత బందు వాళ్ళ అనుకూల నాయకులకు మాత్రమే కేటాయించారన్నారని విమర్శించారు. మహిళల కు వడ్డీలేని రుణాలు, యువతకు నిరుద్యోగ భృతి, అధిక కరెంట్ చార్జీలు, అధిక బస్ చార్జీలు, 1 రూపాయికి నల్ల కనెక్షన్ ఇస్తామని, ఇప్పుడు అధిక నల్లా బిల్లులు ఎలా ఎన్నో రకాలుగా  ప్రజలను మోసం చేస్తూ, మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఇక మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని , మీ అవినీతి, కుటుంబ, రాచరిక పాలనను అంతం చేసేందుకే భారతీయ జనతా పార్టీ ప్రతి శక్తి కేంద్ర పరిధిలో కార్నర్ సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 

మీ అవినీతి పాలన ప్రజలకు క్షుణ్ణంగా వివరించి అర్థమయ్యేలా  తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు,  కసిరెడ్డి భాస్కర్ రెడ్డి , కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్ డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి  బూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్  చంద్రమోహన్  సత్య కూర్మ  జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చ నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

Satyam NEWS

పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన తూర్పగోదావరి ఎస్ పి

Satyam NEWS

వసంతం అంటే

Satyam NEWS

Leave a Comment