34.7 C
Hyderabad
May 5, 2024 00: 20 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగిస్తాం: ఎమ్మెల్యే

#wanaparthy

వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగించి, వనపర్తిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ లో ఉన్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వచ్చే నెలలో చర్చించి ఒక్కొక్కటిగా సమావేశాలు పెట్టి చర్చించి పరిష్కారం దిశగా కృషి చేసుకోడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు.

స్వీపింగ్ మెషిన్ కొనుగోలు, రిపేర్ అంశంలో తగు చర్యలు తీసుకోవాలని కమీషనర్ కు సూచించారు. వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ ను మునిసిపల్ కౌన్సిల్  ఆమోదించింది. మంగళవారం వనపర్తి మునిసిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,  అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మునిసిపల్ కమీషనర్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సమావేశం లో వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి 2024-25 సంవత్సరానికిగాను  రూ.28.70 కోట్ల అంచనా బడ్జెట్ ను మునిసిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అధికారులు సకాలంలో టాక్స్ లను సేకరించి ఆదాయం పై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు అన్ని వేగంగా దశల వారీగా పరిష్కరిచాలని ఆదేశించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వనపర్తి పట్టణంలో కరెంటు అప్రకటిత కోతపై ఫిర్యాదు

Satyam NEWS

పేద ముస్లిం లకు రంజాన్ పండుగ కానుకల పంపిణీ

Satyam NEWS

అలవికాని నిబంధనలతో రిజిస్ట్రేషన్లు కష్టతరం

Satyam NEWS

Leave a Comment