36.2 C
Hyderabad
April 27, 2024 22: 57 PM
Slider పశ్చిమగోదావరి

అలవికాని నిబంధనలతో రిజిస్ట్రేషన్లు కష్టతరం

#registration

భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్ మెంట్లు తదితర స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న అలవికాని నిబంధనల వల్ల అమ్మకాలు కొనుగోళ్ళ ముందుకు సాగడం లేదని ఈ విధానం వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవడమే కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ లు ఆగిపోతున్నాయని దస్తా వేజుల లేఖర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు.

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రైతు తన భూమి అమ్ముకునే సమయం లో రైతుకు ఆ భూమిని కొనుగోలు చేసే వ్యక్తి కి ఈ కె వై సి తప్పనిసరి చేయడం ఈ కె వై సి లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అడ్డుపడుతున్న రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలు అమ్మకం దారులకు కొనుగోలు దారులకు తలనొప్పిగా మారాయని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వెంకట సుబ్బారావు అన్నారు.

ఈ కె వై సి విధానం వల్ల రిజిస్ట్రేషన్ సమయం లో వృద్ధుల పేరున ఉన్న ఆస్తులు అమ్మే సమయం లో ఆన్ లైన్ లో వృద్ధుల వేలిముద్రల ను డివైజ్ లు తీసుకోవడం లేదన్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఐరిష్ పరికరాలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అమలు జరగడం లేదని వెంకట సుబ్బారావు తెలిపారు.

ఇటువంటి పరిస్థితులలో బాంక్ లు కూడా ఆస్తులను తనఖా పెట్టుకుని లోన్ ఇవ్వడానికి మెమోరాండం ఆఫ్ డిజిట్ టైటిల్ డెడ్ అడుగుతున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే దస్తావేజులలో పొరబాటున ఒక సర్వే నంబరుకు బదులు ఇంకో సర్వే నంబరు ఉన్నప్పుడు దస్తా వేజుల సవరణ చేయడానికి ఎం ఆర్ ఓ దగ్గరకెళితే రిజిస్ట్రార్ ఆఫీసుకెళ్ళండని ఇలా ఒకరి పై ఇంకొకరు నెట్టుకుంటూ అమ్మకం దారులను కొనుగోలు దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రిజిస్ట్రేషన్ శాఖ యూజర్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. 10 రూపాయలుండే మార్కెట్ విలువ ధ్రువ పత్రం 50 రూపాయలు, ఈ సి సర్టిఫికెట్ 10 నుండి 100 రూపాయలు, సర్టిఫైడ్ కాపీ 20 నుండి 100 రూపాయలు, ప్రతి డాక్యు మెంట్ చార్జీ 200 నుండి 500 లకు పెంచిందని ఇలా యూజర్ చార్జీలను కూడా సామాన్యులకు భారంగా పెంచడం వల్ల కూడా ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర దస్తా వేజుల లేఖర్ల సంఘ అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు.

తనఖా పెట్టుకుని ఆస్తులపై లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం తెచ్చిన కొత్త జి ఓ వల్ల రిజిస్ట్రేషన్ లు పెద్ద ఎత్తున ఆగిపోవడం తో పాటు రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వం నష్టపోతుందని సుబ్బారావు గుర్తు చేశారు.

Related posts

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేత‌నం రూ. 3 వేలు పెంపు

Sub Editor

యండమూరి “అతడు ఆమె ప్రియుడు” నుంచి కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!

Satyam NEWS

చివ‌ర‌కు మిగిలేది…

Satyam NEWS

Leave a Comment